YouVersion Logo
Search Icon

యెషయా 33

33
1దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు
నీకు శ్రమ
నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు
శ్రమ
నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన
బడెదవు
నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను
వంచించెదరు.
2యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు
కరుణించుము
ఉదయకాలమున వారికి బాహువుగాను
ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను
ఉండుము.
3మహాఘోషణ విని జనములు పారిపోవును
నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు.
4చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచ
బడును
మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు
దురు
5యెహోవా మహాఘనత నొందియున్నాడు
ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను
నీతితోను సీయోనును నింపెను.
6నీకాలములో నియమింపబడినది స్థిరముగానుండును
రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు
కలుగును
యెహోవా భయము వారికి ఐశ్వర్యము.
7వారి శూరులు బయట రోదనముచేయుచున్నారు
సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు.
8రాజమార్గములు పాడైపోయెను
త్రోవను నడచువారు లేకపోయిరి
అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమాన
పరచెను నరులను తృణీకరించెను.
9దేశము దుఃఖించి క్షీణించుచున్నది
లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది
షారోను ఎడారి ఆయెను
బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి.
10యెహోవా ఇట్లనుకొనుచున్నాడు
–ఇప్పుడే లేచెదను
ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను.
ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను.
11మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును
కందురు.
మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయుచున్నది.
12జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను
నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును.
13దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి
సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.
14సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు
వణకు భక్తిహీనులను పట్టెను.
మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప
గలడు?
మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ
సించును?
15నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట
లాడుచు
నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు
లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని
హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని
చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు
ఉన్నతస్థలమున నివసించును.
16పర్వతములలోని శిలలు అతనికి కోటయగును
తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి
శాశ్వతముగా ఉండును.
17అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె
దవు
బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన
బడును.
18నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును.
జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు?
తూచువాడెక్కడ ఉన్నాడు?
బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?
19నాగరికములేని ఆ జనమును
గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య
భాషయు
పలుకు ఆ జనమును నీవికను చూడవు.
20ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న
సీయోను పట్టణమును చూడుము
నిమ్మళమైన కాపురముగాను
తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష
లేమును చూచును
దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో
ఒక్కటియైనను తెగదు.
21అచ్చట యెహోవా ప్రభావముగలవాడై
మన పక్షముననుండును, అది విశాలమైన నదులును
కాలువలును ఉన్న స్థలముగా ఉండును
అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు
గొప్ప ఓడ అక్కడికి రాదు.
22యెహోవా మనకు న్యాయాధిపతి
యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు
ఆయన మనలను రక్షించును.
23నీ ఓడత్రాళ్లు వదలిపోయెను
ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు
చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు
సొమ్ము విభాగింపబడును
కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.
24నాకు దేహములో బాగులేదని అందులో నివసించు
వాడెవడును అనడు
దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

Currently Selected:

యెషయా 33: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in