యెషయా 32
32
1ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన
చేయును
అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.
2మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు
చాటైన చోటువలెను ఉండును
ఎండినచోట నీళ్లకాలువలవలెను
అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను
ఉండును.
3చూచువారి కన్నులు మందముగా ఉండవు
వినువారి చెవులు ఆలకించును.
4చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును
నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
5మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు
కపటి ఉదారుడనబడడు.
6మూఢులు మూఢవాక్కులు పలుకుదురు
భక్తిహీనముగా నడుచుకొందురు
యెహోవానుగూర్చి కానిమాటలాడుచు
ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు
దప్పిగొనినవారికి పానీయములేకుండ చేయుచు
హృదయపూర్వకముగా పాపము చేయుదురు.
7మోసకారి సాధనములును చెడ్డవి
నిరుపేదలు న్యాయవాదన చేసినను
కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు
దురాలోచనలు చేయుదురు.
8ఘనులు ఘనకార్యములు కల్పించుదురువారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
9సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి
నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
10నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు
మీకు తొందర కలుగును
ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
11సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి
నిర్విచారిణులారా, తొందరపడుడి
మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె
పట్ట కట్టుకొనుడి.
12రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా
వల్లుల విషయమైవారు రొమ్ము కొట్టుకొందురు.
13నా జనుల భూమిలో
ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల
తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును.
పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు
14-15నగరి విడువబడును జనసమూహముగల పట్టణము
విడువబడును
కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ
లుగా ఉండును
అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు
మేయు భూమిగాను ఉండును
అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత
మైన భూమి వృక్షవనముగానుండును.
16అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల
భరితమైన భూమిలో నీతి దిగును
17నీతి సమాధానము కలుగజేయును
నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.
అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ
స్థానములయందును సుఖకరమైన నివాసముల
యందును నివసించెదరు
18-19అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు
పడును
పట్టణము నిశ్చయముగా కూలిపోవును.
20సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను
గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
Currently Selected:
యెషయా 32: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.