YouVersion Logo
Search Icon

యెషయా 31

31
1ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు
యెహోవాయొద్ద విచారింపకయు
సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను
ఆధారము చేసికొని
వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యు
లనియువారిని ఆశ్రయించువారికి శ్రమ.
2అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు.
మాట తప్పక దుష్టుల యింటివారిమీదను
కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన
లేచును.
3ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు
ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ
కావు
యెహోవా తన చెయ్యిచాపగా సహాయముచేయు
వాడు జోగును
సహాయము పొందువాడు పడును
వారందరు కూడి నాశనమగుదురు.
4యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు
–తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము
కూడిరాగా
సింహము కొదమసింహము
వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య
పడకయు
తనకు దొరికినదానిమీద గర్జించునట్లు
సైన్యములకధిపతియగు యెహోవా
యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని
దాని కొండమీదికిని దిగి వచ్చును.
5పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు
సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును
కాపాడును
దాని కాపాడుచు విడిపించుచునుండును
దానికి హానిచేయక తప్పించుచునుండును.
6ఇశ్రాయేలీయులారా,
మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో
ఆయనవైపు తిరుగుడి.
7మీకు మీరు పాపము కలుగజేసికొని
మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను
సువర్ణ విగ్రహములను
ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.
8నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలు
దురు
మనుష్యునిది కాని కత్తిపాలగుదురు.
ఖడ్గ మెదుటనుండివారు పారిపోవుదురు
9వారి పడుచువారు దాసులగుదురు
భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును
వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక
దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో
ఆయన కొలిమియు ఉన్నవి.

Currently Selected:

యెషయా 31: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in