గ్రేస్ గీతంనమూనా

 గ్రేస్ గీతం

5 యొక్క 4

మీరు కొన్ని మాటలను ప్రతిరోజూ ... వింటుంటారు. కొన్ని మీ మదిలో ఉన్నాయి. కొన్ని మీ సోషల్ మీడియాలో ఉన్నాయి. కొన్ని మీ స్నేహితుల నుండి వచ్చాయి. కొన్ని మిమ్మల్ని బహిరంగంగా ఇష్టపడని వారి నుండి వస్తాయి.

అవి మీరు ఎవరో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ... మరియు మీరు ఎవరై యుండాలో అలాకావడానికి ఏమి చెయ్యాలో చెప్పే మాటలు.

ఆ మాటలన్నింటిలో ఒక సమస్య ఏమిటంటే, వారు తమ వాగ్దానాన్ని నెరవేర్చలేరు. మీ గుర్తింపు అనేది మీరు సంపాదించుకోవాల్సినది, మీ స్వంతంగా గుర్తించ గలిగేది, లేదా నిలబెట్టుకోవడానికి పోరాడడం కాదు. ఇది దేవుడిచ్చిన బహుమతి, ఈరోజు దాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేయాలనుకుంటున్నాను.

పాస్టర్ మరియు వేదాంతవేత్త జాన్ పైపర్ ఇలా వ్రాశాడు, "యేసులో, మనం మన నిజమైన స్వభావాన్ని కోల్పోము, కానీ మనం ఆయనలో మాత్రమే మన నిజమైన వ్యక్తిగా అవుతాము"

కనుక మీ నిజమైన వ్యక్తిత్వం ఎక్కడ కనుగుంటారు?

డబ్బులోనా?అనుచరులలోనా?సాధనలోనా?చూపులోనా?రాజకీయాల్లోనా?అధికారంలోనా?హోదాలోనా?లేక సెక్స్ లోనా?

లేదు. యేసు లోనే

2 కొరింథీయులకు 5:17 "కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను"

ఇది గొప్ప వార్త! మీరు ఎవరు అనేది చర్చకు రాదని అర్థం. మీ గుర్తింపు మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని రక్షించిన దేవుని నుండి వచ్చింది. ఆయన, “యేసు కారణంగా మీరు సరికొత్త సృష్టి.. ఇతరుల ఆమోదం పొందేందుకు ప్రయత్నించకుండా, మీ అర్హతను నిరూపించుకోవడానికి ప్రయత్నించకుండా, మీ గతం నుండి పారిపోకుండా స్వేచ్ఛగా ఉన్నారు అని చెబుతున్నాడు”.

దేవుని దయతో యేసు నందు, మీరు ఎలా ఉండేవారో, ఇతరులు మీరు ఎలా ఉంటారని అనుకుంటున్నారో, లేదా ప్రపంచం మీరు ఎలా ఉండాలని చెబుతుందో మీరలా లేరు. దానికి బదులుగా, మీరు దేవుని ప్రియమైన బిడ్డగా వున్నారు.

అత్యంత ఆసక్తికరమైన విషయమిదే...

దేవుడు మిమ్మల్ని సృష్టించినందున, మీరు ఆయనకు ఎంత దగ్గరవుతున్నారో, అంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిగా మీరు మార్చబడతారు. ఒక విధంగా, మనమందరం స్వంతంగా గుర్తించడానికి చాలా సమయం మరియు కృషిని వెచ్చిస్తున్న మీ నిజమైన స్వభావాన్ని దేవుడు మీకు తిరిగి ఇస్తాడు.

దాని అర్థమేమిటో మీరు గ్రహించారా?

ఇతరులు మిమ్మల్ని నిందించినప్పుడు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడల్లా లేదా ప్రపంచం ఆమోదం పొందాలనే తపన మీకు వచ్చినప్పుడు, మీరు పట్టుకోగలిగిన సత్యము ఒకటి వున్నది. మీరు గట్టిగా నిలబడి, “నేను ఎవరో నాకు తెలుసు. ఇది ప్రశ్నే కాదు. నేను దేవుని బిడ్డను, క్షమింపబడ్డాను, విముక్తి పొందాను మరియు యేసు ద్వారా క్రొత్తగా చేయబడ్డాను.”

ముందుకు సాగండి, ఈరోజే; పనిలో, సామాజిక విషయాలలో, మీ స్నేహితులతో, మీ స్వంత హృదయంలో దీన్ని ప్రయత్నించండి. యేసు ద్వారా మీరు ఎవరో దేవుడు చెప్పినట్లు నిర్ధారించండి. దాన్ని స్వీకరించండి. నమ్మండి. అందులో నివసించండి. మరియు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎన్నడూ మర్చిపోవద్దు.

ఆశీర్వాదములు,

— నిక్ హాల్

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

 గ్రేస్ గీతం

ఈ గ్రేస్ భక్తి గీతం ద్వారా మీ పట్ల దేవుని ప్రేమ యొక్క లోతులను కనుగొనండి. సువార్తికుడు నిక్ హాల్ మీపై పాడిన దేవుని కృప గీతంలో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ శక్తివంతమైన 5-రోజుల భక్తితో మీకు మార్గనిర్దేశం చేస్తారు.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము PULSE Outreachకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://anthemofgrace.com/