గ్రేస్ గీతంనమూనా

 గ్రేస్ గీతం

5 యొక్క 1

“ఎవరైనా నన్నెలా ప్రేమిస్తారు?”

మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నేననుకున్నాను.

పెరుగుతున్నప్పుడు, నేనంత పరిపూర్ణుడను కాను. ఇప్పటికీ అలానే వున్నాను. కానీ యుక్తవయసులో, నేను చాలా అపరాధం మరియు అవమానాన్ని కలిగి ఉన్నాను. "దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు" లేదా "ఆయన మీ జీవితానికి మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు" వంటి విషయాలు ప్రజలు నాకు చెబుతుండే వాళ్ళు. కానీ అనర్హులుగా ప్రేమకు నోచుకోని వారికి అలాంటి మాట నమ్మడం చాలా .... కష్టంగా ఉంటుంది.

అందుకే నాకు "అద్భుతమైన కృప" అనే పాటను గురించిన కథ ఎంతో నచ్చింది.”

అద్భుతమైన కృప, అదెంత మధురమైనది

ఘోరపాపినైన నన్ను రక్షించింది!

ఒకప్పుడు నశించిన వాడను, కానీ ఇప్పుడు కనుగొనబడ్డాను

గుడ్డి వాడను, కానీ ఇప్పుడు చూడగలను.

మీరు చర్చిలో సమయం గడిపినా లేకున్నా, ఈ పాట మీకు తెలిసి ఉండవచ్చు. చరిత్రలో అత్యధికంగా రికార్డ్ చేయబడిన పాటలలో ఒకటిగా, "అద్భుతమైన కృప" ఎల్విస్, అరేతా ఫ్రాంక్లిన్ మరియు బోనో కలిసి ఈ పాటను పాడారు. నెల్సన్ మండేలా నాయకుడుగా నియమితుడైనప్పుడు ఇది పాడబడింది మరియు ది సింప్సన్స్‌లో కూడా ప్రదర్శించబడింది!

కానీ అనేకులకు తెలియని విషయం ఏమిటంటే, “అద్భుతమైన కృప ” జాన్ న్యూటన్ అనే పద్దెనిమిదవ శతాబ్దపు బానిస-ఓడ నావికుడు వ్రాసిన పాట.

న్యూటనుకు మనలో చాలా మందిని పోల్చి చూస్తే చులకనగా కనిపించేటటువంటి చరిత్ర వున్నది మీరు తప్పులు చేశారు అనుకుంటున్నారా? పాపాత్ములు అనుకుంటున్నారా? డబ్బుల కోసం మనుష్యులతో వ్యాపారం చేసిన అపరాధము న్యూటను చేతులు కలిగియున్నవి.

కనుక అటువంటి వ్యక్తి ఎలా దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో చెప్పగల పాటను అతడెలా వ్రాసాడు?

దానికి జవాబు కృప.

యేసుక్రీస్తు చెప్పే శుభవార్త మీరు మరియు నేను దేవునిచే ప్రేమించబడేంతగా మనల్ని మనం శుభ్రం చేసుకోగలమని కాదు. మనలో మంచితనమే లేనప్పటికీ, మన పాపాల నుండి మనలను రక్షించడానికి దేవుడు ప్రేమతో మన దగ్గరకు వచ్చాడు.

రోమీయులకు 5:8 లో ఇలా వ్రాయబడింది, "అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను."

జాన్ న్యూటను దేవుని దయను వెక్కిరిస్తూ ఎదిగాడు. నేను వింటూ పెరిగిన దేవుని ప్రేమ గురించిన విషయాలనే అతను విన్నాడు. మీరు కూడా విన్న విషయాలు కావచ్చు. కానీ అతను దానిని నమ్మలేకపోయాడు ... నమ్మడానికి ఇష్టపడలేదు.

అయితే ఒక రాత్రి తన బానిస ఓడను భయంకరమైన తుఫాను గుండా నడిపిస్తున్నప్పుడు, అతను దయ కోసం దేవునికి మొరపెట్టాడు. అతని ఓడ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నప్పుడు, చివరకు యేసుపై విశ్వాసం ఉంచాడు మరియు తాను చాలా కాలంగా తిరస్కరించిన దయను పొందాడు.

తరువాత, గ్రేట్ బ్రిటనులో బానిస వ్యాపారాన్ని అంతం చేయడంలో న్యూటను గొప్ప పాత్ర పోషించాడు. బోధకుడిగా మారాడు, పేదల పట్ల శ్రద్ధ చూపుతూ, అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన పాస్టరుగా పేరు తెచ్చుకున్నాడు.

దేవుని కృప న్యూటనును రక్షించడం మాత్రమే కాదు, న్యూటనును మార్చివేసింది.

అయితే న్యూటనుకి దేవుడితో సంబంధం ఎంతగా పెరిగినా అదంతా దయ వల్లనే అని మరచిపోలేదు. అతని పాపం తీర్పుకు అర్హమైనది. మనది పాపం కూడా. కానీ సిలువపై మన స్థానాన్ని ఇష్టపూర్వకంగా తీసుకున్న యేసుపై ఆ తీర్పును కుమ్మరించేలా దేవుని ప్రేమ నడిపించింది. ఇది అద్భుతమైన కృప.

న్యూటను తన జీవిత చివరిలో ఇలా అన్నాడు...

"నేను రెండిటిని గుర్తుపెట్టుకుంటాను - నేను గొప్ప పాపిని - దేవుడు గొప్ప రక్షకుడు!"

కాబట్టి, ఆ అపరాధం మరియు అవమానం గురించి ఏమిటి? మీ తప్పుల గురించి ఏమిటి? మీరు ఇలా చేసి యుండకూడదు అనుకున్న పనులు మరియు చెప్పిన మాటల సంగతేమిటి? మీరు ప్రేమలేనివారా? దేవుని కృప పొందలేనంత ఘోరమైన పాపులా?

ఈ రోజు మనం న్యూటను నుండి ఒక పాఠం నేర్చుకుందాం మరియు దేవుని ప్రేమ మన అర్హతపై ఆధారపడి ఉండదు మరియు నాలాంటి నీచుడిని రక్షించడానికి అతని దయ చాలును అనే అఖండమైన సత్యంలో విశ్రాంతి తీసుకుందాం.

ఆశీర్వాదములు

- నిక్ హాల్

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

 గ్రేస్ గీతం

ఈ గ్రేస్ భక్తి గీతం ద్వారా మీ పట్ల దేవుని ప్రేమ యొక్క లోతులను కనుగొనండి. సువార్తికుడు నిక్ హాల్ మీపై పాడిన దేవుని కృప గీతంలో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ శక్తివంతమైన 5-రోజుల భక్తితో మీకు మార్గనిర్దేశం చేస్తారు.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము PULSE Outreachకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://anthemofgrace.com/