సరియైన అడుగులునమూనా

సరియైన అడుగులు

3 యొక్క 3

ఒప్పందాలు,వైరుధ్యాలు

ఇస్కరియోతు యూదా ఒక గుంపు మనుష్యులు, అధికారుల బృందాన్ని యేసు వద్దకు నడిపించినప్పుడు ఘోరమైన సంఘటనలు జరిగాయి. అతడు తన బోధకుని విషయంలో భ్రమలో పడిపోయాడు. భూసంబంధమైన రాజుగా పట్టాభిషేకం పొందడానికి ప్రభువు ఆసక్తి చూపించలేదు. బంగారం, వెండిపై ఇష్టత చూపలేదు, స్టాక్ మార్కెట్‌పై ఖచ్చితమైన వైఖరి లేదు. అతడు చేసిన ద్రోహం కోసం తాను అందుకున్న ముప్పై వెండి నాణేలు చిన్న బట్టల సంచిలో సులభంగా సరిపోయాయి. నిజానికి అది అతనికి ప్రోత్సాహకరమైనదేనా?యూదాను కదిలించిందిఏమిటి?

అతని ప్రేమ డబ్బు, అధికారం కోసమా? భూసంబంధమైన రాజ్యంలో ఆర్థిక మంత్రిగా ఉండడం మీద అతడు తన దృష్టి నిలిపాడా?అతని ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ,మతాధికారుల వద్దకు వెళ్లి వారితో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సరైన అడుగులు వేస్తున్నాడని భావించినప్పుడు,అతను తప్పుదారి పట్టించే ఉత్సాహంతో నింపబడ్డాడు, నగరంలో ప్రముఖులందరికీ ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తిని తప్పించడంలో తాను సాధనంగా ఉన్నాడని ఊహించుకొన్నాడు. తాను ‘నిర్దోషి రక్తాన్ని’ పట్టించాడని గుర్తించినప్పుడుతనలోని ఉత్ప్రేరక హార్మోనుల వేగం త్వరితంగా తగ్గిపోయింది.

తరువాత,అతను వెళ్లి ఉరి వేసుకున్నాడు-కలవరం మరింతగందరగోళంగా మారింది! మూడేళ్ళకు పైగా యేసుతో సన్నిహిత సహవాసం కలిగియున్నప్పటికీ,నిత్యజీవంకోసం అయిన సత్యాలు యూదా నేర్చుకోవడంలోవిఫలమయ్యాడు. అతను నాణేలను లెక్కించడంలో చాలా పనికలిగియున్నాడు, తన ఆశీర్వాదాలను లెక్కించడం మర్చిపోయాడు. యోనా ప్రవక్త కూడా కొంతవరకు యూదాలాగా ఉన్నాడు- అతడు దేవుణ్ణి అనుసరించాలని అనుకున్నాడు కాని తన సొంత నిబంధనల ప్రకారం ఉండాలని కోరుకున్నాడు. తనకు నచ్చని ఒక కర్తవ్యాన్ని చేపట్టమని చెప్పినప్పుడు,అతను పారిపోయి దాగుకోడానికి ప్రయత్నించాడు,అయితేదేవుడు ఆయన జి.పి.ఎస్‌ లో ఎప్పటికప్పుడు యోనాను చూస్తూఉన్నాడు. జీవితంలో కొన్ని కఠినమైన పాఠాలు నేర్చుకున్నాడు.

మనం వేసే అడుగులు ఆధ్యాత్మికంగా ఫలవంతంగా ఉండాలంటే అవి దేవుని ఆమోదాన్ని పొందాలి.

నోవహుతాగిన స్థితిలో ఉన్నప్పుడుతన కుమారుడు హాము చూసిన ఆసక్తికర వృత్తాంతం ఆదికాండంలో మనం చూస్తున్నాము, ఈ వార్తలతో విసికిపోయిన హాము బయటకు వెళ్లి తన సోదరులకు చెప్పాడు.మరొక వైపుషేము, యాపేతు తమ వృద్ధాప్యపు తండ్రి తరపున సిగ్గుపడి సభ్యతతో తిరిగి గుడారంలోనికి వచ్చి నిస్సాహాయ స్థితిలో ఉన్న తమ తండ్రిని చూడకుండాతమ భుజాలమీద ఉన్న వస్త్రంతో తమ తండ్రిని కప్పి ఉంచారు.ఇది ప్రజల పట్లా, వారి లోపాల పట్లా హత్తుకునేలాఉండే శ్రద్ధను చూపిస్తుంది.

ఇక్కడ ఒక వైరుధ్యం ఉంది. - వెనుకకు నడుస్తుండడం అయినా పురోగతి (ఆధ్యాత్మిక బహుమతిని పొందడం). మోకరించండి, ప్రార్థనలోవిజయం సాధించండి,ఊరక నిలిచియుండండి (ఏమీ చెయ్యకండి – అయితే ప్రార్థన చెయ్యండి)ప్రభువు రక్షణను చూడండి. శోధన, పాపం నుండి దూరంగాఉండడం,మనం పడిపోయినప్పుడుతిరిగి పైకిలేవడం,సహనం,కృప,క్షమను ప్రదర్శించడం మనం సరైన దిశను తీసుకోవడంలో తీసుకునే చిన్న అడుగులు.

మన చింతలన్నింటినీ ప్రభువుపై వేయడం మనం చేయగలిగిన ఉత్తమ అడుగులలో ఒకటి. సరైన అడుగులు వెయ్యండి. – జీవించడం.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

సరియైన అడుగులు

మనకు అవసరమైన దానిని తెలుసుకోవడం, మన లక్ష్యాలను అనుసరించడం చెడ్డవిషయం కాదు. అయితే మనం దేవుని వాక్య వెలుగులో నడవాలి. కొంతమంది సరైన దిశలో అడుగులు వేస్తారు, సాధకులుగా మారతారు. మరికొందరు ఒక ప్రకటన చేయడానికి ప్రయత్నించి, ముగింపులో నిలిచిపోతారు. మన శరీరానికి సంబంధించిన ప్రవృత్తిని సంతృప్తి పరచడం మన ఆత్మలతో విభేదాలకు గురిచేస్తుంది. మనం చేసే ఎంపికలు మరణానికీ లేదా జీవానికీ దారి తీస్తాయి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/