సరియైన అడుగులునమూనా

సరియైన అడుగులు

3 యొక్క 2

ఆధ్యాత్మికం – భౌతికం

సరైన అంశాలు చెప్పడం, సరైన సమయంలో సరైన ప్రదేశాలలో ఉండడం అవి మనకు తప్పుగా కనిపిస్తున్నప్పటికీ వాటి విషయంలో ప్రభువైన యేసు మనకు ప్రేరణ. అతను పాపులతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని విడుదల చేయడానికి ఒక స్మశానవాటికలో నడిచాడు, ఒక మనిషిని నాలుగు రోజులుగా చనిపోయిన వ్యక్తిని లేవనెత్తడానికి ఆయన ఒక సమాధిని సందర్శించాడు- ఎంచుకోవడం ద్వారా సందర్శించడానికి ఊహించలేని ప్రదేశాలు,అయితేమీరు ప్రభువైన యేసు లాంటి పరిచర్య కర్తవ్యంలో మీరు ఉన్నప్పుడు,మీ అధికార పరిధికి మించినది స్థలంగానీ, వేదకలేని వ్యక్తి గానీ ఉండరు.

ప్రభువైన యేసు యెరూషలేముకు వెళ్ళడానికి మనస్సు పెట్టినప్పుడు,ఆయనతన మరణం, పునరుత్థానంతో సహా అక్కడ తనకు జరగబోయే అన్ని సంఘటనలను ఆయన తన శిష్యులకు వెల్లడించాడు. ఇది విన్న పేతురు కోపంగా, “ఓహ్,ప్రభూ,ఈ విషయాలు నీకు ఎప్పుడూ జరగకూడదు. నీవు దేవుడవు! నీవు చనిపోయినట్లయితే,మీ అనుచరులందరూ కృంగిపోతారు, చెల్లాచెదురవుతారు.ఈ‘యేసు ఉద్యమం’వేగాన్ని కోల్పోతుంది, ఆపై మాకు ఏమి జరుగుతుంది?యేసు అతనివైపు తీవ్రంగా చూసాడు.“మీరు నేరం చేసినవారుగా ఉన్నారు, దేవుని ఉద్దేశ్యాలనూ, ప్రణాళికలను ముందుగా చూడలేకపోతున్నారు కనుక మీరు సాతాను సంబంధులు. నశించిపోయే మనుషులు.

మీరు స్వల్ప దృష్టిగలవారు,స్వల్ప స్వభావం గురించి చెప్పనవసరం లేదు, మీరు లోకంలోని తాత్కాలిక విషయాలను వెదకుతారు. అంతకుముందు మత్తయి16:17వచనంలో పేతురు తలపై తట్టి అభినందించిన తరువాత,ఇప్పుడుపేతురు తీవ్రమైన మందలింపును పొందినట్లు కనిపిస్తుంది. తన బోధకుని విషయంలో తీవ్రమైన తప్పిదంగా కనిపిస్తున్నదీ, మనుష్యులు ఆయన పట్టుకోడానికి యెదురు చూస్తున్న యెరూషలెం వైపుకు వెళ్ళడమూ అంతిమ విజయం పొందడానికి ప్రదం అడుగు కాబోతుంది. ప్రభువైన యేసు ఒక్కడే తప్పును సరైనదిగా చెయ్యగలవాడు. శాపాన్ని ఒక ఆశీర్వాదంగా చెయ్యగలవాడూ ఆయనే. సిలువపై ప్రభువు భయానక మరణాన్ని ప్రజలు ఒక ముగింపుగా చూస్తారు,అయితే అది ఆయన మహిమకూ, ఆయన యందు విశ్వసించినవారికి రక్షణకూ ఆరంభం.

ఒక విత్తనం మీరు చూడగలిగినంత కాలం అది చనిపోయినది గానే ఉంటుంది. అయితే భూమిలో వేసి దానిని మట్టితో కప్పినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. యేసు మరణం తప్పు జరిగినట్లుగా అనిపిస్తుంది. దేవుడు చనిపోడు,ఆయన చనిపోతాడా? ‘భౌతిక’మానవుడుఈ సంఘటనను నిరుత్సాహపరిచే,వ్యర్థమైన, అనాగరికమైనదిగా భావిస్తాడు. సమయం, ప్రయత్నం రెండూ పూర్తి వృధా అని భావిస్తాడు. మానవ జీవితంలో ప్రధానమైనదిగా యెంచబడిన యవ్వన జీవితం సమాప్తి చెయ్యబడింది, ఎంతో శ్రమ,రక్తపాతం,దుఃఖం – దీని అంతం ఏమిటి? అయితే‘ఆధ్యాత్మిక’మానవుడుసిలువను మించి చూస్తాడు, విత్తనం నాటడం,మరణంలోనుండి జీవం వెలుపలికి రావడం, ప్రయోజనాలను పొందడం,మహిమ, కిరీటం.ఈ సంఘటనలలో ఉన్న లెక్కలన్నీ -ఒంటరి జీవితం తీసివేయబడింది, లెక్కించలేని లక్షలాది మంది మనుష్యులు రాజ్యానికి జతచెయ్యబడ్డారు, వేదన, శ్రమ అంతా ఆయనకే. సంతోషం, ఆనందం మనకోసం!అతిశయించలేని ఎంత గొప్పఆధ్యాత్మిక ఒప్పందం!

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

సరియైన అడుగులు

మనకు అవసరమైన దానిని తెలుసుకోవడం, మన లక్ష్యాలను అనుసరించడం చెడ్డవిషయం కాదు. అయితే మనం దేవుని వాక్య వెలుగులో నడవాలి. కొంతమంది సరైన దిశలో అడుగులు వేస్తారు, సాధకులుగా మారతారు. మరికొందరు ఒక ప్రకటన చేయడానికి ప్రయత్నించి, ముగింపులో నిలిచిపోతారు. మన శరీరానికి సంబంధించిన ప్రవృత్తిని సంతృప్తి పరచడం మన ఆత్మలతో విభేదాలకు గురిచేస్తుంది. మనం చేసే ఎంపికలు మరణానికీ లేదా జీవానికీ దారి తీస్తాయి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/