కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికినమూనా
అవలంబించవలసిన వైఖరి
ఒక యుద్ధఖైదీ తొమ్మిది సంవత్సరాలపాటు చిత్రహింసల్ని అనుభవించి బయటపడ్డాడు. అతను విడుదల పొందిన తర్వాత, అతనినొకరు ఈ ప్రశ్న నడగడం జరిగింది: అతని స్నేహితుల్లో కొందరు నిలబడలేకపోగా అతనెలా నిలబడగలిగాడు. అతను ఏమాత్రం తడబడకుండా జవాబు చెప్పాడు. త్వరలోనే విడుదల ఉంటుందని ఎదురుచూచినవారు నిరుత్సాహపడ్డారు. వారు ధైర్యం కోల్పోయారు నిరీక్షణ కోల్పోయారు చివరకు తమ జీవితాల్నే కోల్పోయారు.
పరిస్థితులెలా ఉన్నా సరే పట్టుదల కోల్పోకూడదని ఉక్కుపిడికిలి బిగించిన వాస్తవతావాదులు కష్టాలు భరించడానికి మానసికంగా సిద్ధపడ్డారు. ఊరకే ఏదో మేలు జరుగుతుందని భావించిన ఆశావాదులు సంవత్సరాలు గడుస్తుండగా ఆశలు విఫలమై నిబ్బరం కోల్పోయారు, ఏరోజుకు ఆరోజు సహించవలసినవాటిని సహించలేక వదిలిపెట్టారు.
ఆశావాదంలో తప్పు లేదు! మనం నిరీక్షణ కలిగి జీవించాలని బైబిల్ మనకు చెబ్తోంది. అయితే, అన్ని సమయాల్లో అంతా బాగుంటుందనే కృత్రిమ ఆశల్లో బ్రతకడానికి కాదు మన పిలుపు.
విశ్వాసానికి ఎదురయ్యే పరీక్ష మన దృష్టి దేవునిమీద ఏకాగ్రతతో నిలిచేలాగా చేస్తుందని, ఓర్పును పుట్టిస్తుందని యాకోబు చెబ్తున్నాడు. బరువులెత్తే క్రీడాకారుడు వ్యాయామం చేసేటప్పుడు అతని నరాలు తెగి పోయేంతగా బయటకు ఉబ్బినప్పటికీ అవి తదుపరి అభ్యాసానికి అతను మరింతగా బలం పొందేటట్లు చేసినట్లే మన విశ్వాసం కూడా ప్రతి సారీ వీగిపోతుందేమో అనేలాగా ఉన్నా ప్రతిసారీ ఇంకా ఓర్పును పెంపొందిస్తుంది. ఓర్పు కలిగేది ఇలాగే!
ఓర్పును పెంపొందించుకొనడానికి మనకు తోడ్పడే మూడు ప్రశ్నలు ఇక్కడున్నాయి.
ప్రశ్న-1 నా ప్రపంచం భంగపడి ఓటమివైపు నడుస్తునప్పుడు నేనేమి నియంత్రించుకొనగలను?
జవాబు-1మీరు మీ వైఖరిని నియంత్రించుకొనగలరు. కష్టసమయాల నడుమ దేవుని దయాళుత్వాన్ని ఆయన కృపనుబట్టి మీరు ఆనందంగా ఉండగలరు. వైఖరి వేరు, భావోద్వేగాలు వేరు – రెండింటినీ మిశ్రమం చేయకండి. మీరు ఆనందంగా ఉండకపోవచ్చు. అయితే వీగిపోవడాన్ని విడిచిపెట్టండి.
ప్రశ్న-2 నేడు నేను నిలబడడానికి ఏం చేయవలసి ఉన్నాను?
జవాబు-2మీరు ఓర్పు వహించవలసి ఉన్నారు. మీరెంత ఎక్కువగా దేవుణ్ణి నమ్మి పట్టుదలతో విశ్వాసాన్ని కొనసాగించితే అంత ఎక్కువగా మీరు బలం పొందుతారు. నేడు మన ఆందోళనకు కారణం రేపటి గురించి మనలో ఉన్న దిగులు. అయితే మన భవిష్యత్తును మనమే రూపొందించుకోవాలని దేవుడు మనకు చెప్ప లేదు. బదులుగా ఏ రోజుకు ఏది కావాలో దానికొరకు ఆ రోజు మనం దేవుని కృపమీద ఆధారపడాలి.
ప్రశ్న-3 రేపటి కొరకు నా నిరీక్షణ ఏమి?
జవాబు-3జవాబు మీ నిరీక్షణ దేవుడెవరనేదానికి లంగరు వేయబడింది. ఆయన మనసులో ఎల్లప్పుడూ మనకొరకు శ్రేష్ఠమైనవే ఉన్నాయి. మన జీవితాల్లో నిరాశ నిండిన అసాధ్యపు పరిస్థితుల్ని ఆయన ఉపయోగించుకొనగలడు, వాటిద్వారా తన ఉద్దేశాల్ని నెరవేర్చుకొన గలడు, వాటిని మన కనుకూలంగా మార్చగలడు.
నేడు ఆనందం మరియు విశ్వాసం గల వైఖరిని అవలంబించండి. మీ బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణ మవుతుందని మరియు సంపూర్ణమవుతుందని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో మీరేమి ఎదుర్కొనవలసి వచ్చినాగానీ దాని నెదుర్కొనడానికి మీకు కృప తోడుగా ఉంటుంది. మీకు ఆయన కృప ఉంటుంది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ లోకంలోని జీవితం కష్టాలతో నిండి ఉంది. బహుశా మీరు ఇప్పుడు కూడా ఏదైనా శ్రమలోనే ఉండి “ఎందుకు” అని గానీ, లేదా “దీనిలోనుండి నేనెలా బయటపడగలను” అని గానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించు కుంటున్నారేమో. ఈ ప్రశ్నలకు “యాకోబు” పత్రికలో జవాబులున్నాయి! కల్లోలం నిండిన కాలంలో నిలిచే వారుగా ఉండడానికి అవలంబించవలసిన వైఖరి, వనరు, మరియు దైవజ్ఞానం ను సంపాదించుకొనడంద్వారా కష్టసమయాల నడుమ దేవుని ఆనందాన్ని మీరెలా అనుభవించగలరో చిప్ ఇన్ గ్రామ్ ఈ 5-రోజుల పఠన ప్రణాళికలో తెలియజేస్తున్నారు.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/product/art-of-survival-book/