కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికినమూనా
ఆనందానికి కారణం
మనం కష్టకాలంలో జీవిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శ్రమల్ని శోధనల్ని ఎదుర్కొంటున్నారు. బహుశా మీరు కూడా ఎదుర్కొంటుండవచ్చు.
మీరెంత కాలం నుండి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, మీ విశ్వాసం వీగిపోతుందని, తెగిపోయేంతగా సైతం వీగిపోతుందని విస్మయం చెందుతుండవచ్చు.
మనం క్రీస్తులో జయించేవారుగా ఉండడానికి పిలువబడినామని మనకు తెలుసు. అయితే కొంతమందికి ఎలా జయించాలనేది పెద్ద సమస్య కాదు గానీ నిలిచేవారుగానైనా ఎలా ఉండాలనేదే సమస్య.
శ్రమల్ని అనుభవిస్తున్న సంఘానికి సహాయపడడంకొరకు యాకోబు ఈ పత్రికను వ్రాశాడు. తీవ్రమైన హింసల వలన చెదిరిపోయి కలవరపడుతున్న విశ్వాసులకు యేసు సహోదరుడు ఈ పత్రికను వ్రాయడం జరిగింది. నేడు అనేకుల్లాగానే, నాడు ఎలా నిలబడాలో వారు కూడా తెలుసుకొనవలసిన సమయమది.
నేను యాకోబు బోధను కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి అవలంబించవలసిన వైఖరి, వనరు, మరియు దైవజ్ఞానం అని పిలుస్తాను.
అవలంబించవలసిన వైఖరిని, అడగవలసిన వనరును, మరియు అర్థంచేసుకొనవలసిన దైవజ్ఞానం ను యాకోబు మనకు తెలియజేస్తున్నాడు.
ఆ వైఖరిని మనం కోరుకున్నప్పుడు, ఆ సహాయాన్ని మనం అందుకున్నప్పుడు, ఆ ఋజుదృక్పథంనుండి చూడడం మనం నేర్చుకున్నప్పుడు ఏ కఠిన సందర్భాన్నైనా మనం నిబ్బరంగా ఎదుర్కొనగలుగుతాం.
“యాకోబు” పత్రికలోని ఉపదేశాల్ని చూడడానికి ముందుగా మనంతట మనమే కొన్ని సత్యాల్ని జ్ఞప్తికి తెచ్చుకుందాం.
శ్రమలు అనివార్యం.
పతనమైన ప్రపంచంలో శ్రమ తప్పదు (1 పేతురు 4:12; 2 తిమోతి 3:12 చూడండి). అయితే దేవుని కృప ద్వారా మనం వాటిని జయించగలం (యోహాను 16:33).
శ్రమలు మనల్ని బలోపేతం చేస్తాయి లేదా బద్దలు చేస్తాయి.
తమకెదురైన కఠిన సమయాల్లో విశ్వాసంతో నిలబడినవారిగురించి, మరియు రాజీపడినవారిగురించి, మరియు ఓడిపోయినవారి గురించి బైబిల్ తెలియజేస్తుంది. శ్రమలు మనుషుల్ని దేవునినుండి దూరం చేస్తాయి, లేదా ఆయనవైపు నడిపిస్తాయి.
“ఎందుకు” దగ్గర అతుక్కొనిపోయినవారు బాధకు గురవుతున్నారు.
“ఎందుకు” అనే ప్రశ్నలు అడగడం సహజమే, అయితే బాధితులు వాటిని దాటి రాలేకపోతున్నారు. జయించి నిలబడడంలో మొదటి మెట్టు దేవునిలో నమ్మిక నుంచడం.
తదుపరి కొన్ని రోజుల్లో మనం దేవుని వాగ్దానాల్ని పట్టుకొని, “ఎందుకు” దగ్గర అతుక్కొనిపోవడాన్ని వదిలివేద్దాం! “యాకోబు” పత్రికలో ఆచరణీయమైనవి శక్తిమంతమైవి జీవితపరివర్తన కలిగించేవి అయిన నిచ్చెనమెట్టుల్ని దేవుడు వెల్లడిచేశాడు. కల్లోలంతో నిండిన ప్రపంచంలో మనం నిత్యత్వానికి లంగరువేయబడి ఉండేలా మనకు అవసరమైనవాటిని ఇవి అందిస్తున్నాయి. కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి అవలంబించవలసిన వైఖరి, వనరు, మరియు దైవజ్ఞానం నుచూద్దాం.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ లోకంలోని జీవితం కష్టాలతో నిండి ఉంది. బహుశా మీరు ఇప్పుడు కూడా ఏదైనా శ్రమలోనే ఉండి “ఎందుకు” అని గానీ, లేదా “దీనిలోనుండి నేనెలా బయటపడగలను” అని గానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించు కుంటున్నారేమో. ఈ ప్రశ్నలకు “యాకోబు” పత్రికలో జవాబులున్నాయి! కల్లోలం నిండిన కాలంలో నిలిచే వారుగా ఉండడానికి అవలంబించవలసిన వైఖరి, వనరు, మరియు దైవజ్ఞానం ను సంపాదించుకొనడంద్వారా కష్టసమయాల నడుమ దేవుని ఆనందాన్ని మీరెలా అనుభవించగలరో చిప్ ఇన్ గ్రామ్ ఈ 5-రోజుల పఠన ప్రణాళికలో తెలియజేస్తున్నారు.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/product/art-of-survival-book/