దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళికనమూనా

దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళిక

5 యొక్క 5

యోహాను సువార్త 

మనకు జీవాన్ని ఇవ్వడానికి దేవుడు మనతో ఉన్నాడు

యోహాను సువార్త ప్రభువైన యేసును గురించిన కవితా వర్ణనతో ప్రారంభమవుతుంది. తన అసమానమైన శైలిలో అపొస్తలుడు ప్రభువైన యేసు దేవుడనీ, సృష్టించబడిన ప్రతి జీవికి ఆయన ద్వారా జీవం అనుగ్రహించబడినదని ప్రకటించాడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం, ఆ వెలుగూ సమస్త మానవాళికి జీవం అని చెపుతున్నాడు. (యోహాను 1:4). యోహాను తన పత్రికలలో యేసును గురించి మరింతగా వర్ణించడానికి “వెలుగు” అనే పదాన్ని వినియోగిస్తున్నాడు, మనము ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచూ చీకటిలో నడిచిన యెడల మనము సత్యమును జరిగింపకుందుము అని రాస్తున్నాడు. (1 యోహాను 1:6) అందుచేత ప్రభువైన యేసు వెలుగును తెచ్చువాడు, జీవాన్ని ఇచ్చేవాడు. 

మన ప్రపంచంలో వెలుగు సమస్త జీవులకు అవసరమైన ప్రాధమిక అంశం. కిరణజన్య సంయోగక్రియ కోసం మొక్కలకు సూర్యరశ్మి అవసరం, తద్వారా అవి ఆహారాన్ని ఉత్పత్తి చేయగలవు, మనం భుజించేది అవే. కిరణజన్య సంయోగక్రియలోని అదే ప్రక్రియ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది మానవులమైన మనకందరికీ ప్రాముఖ్యమైనది. వెలుగు లేకుండా, భూమి పూర్తిగా ప్రాణములేకుండా తేమతో కూడుకొన్న ప్రదేశంగానూ, చీకటి ప్రదేశంగానూ ఉంటుంది. సహజ ప్రపంచంలో వెలుగూ, జీవం కలిసి కొనసాగుతాయి. ఆత్మీయంగా మరింతగా ఆధ్యాత్మికమైన అంశాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. 

భయంకరమైన లోకానికి ప్రభువైన యేసు వెలుగును తెచ్చాడు. కోటానుకోట్ల జీవితాలను మార్చాడు. మనం పుట్టినప్పుడే మనలో జీవాన్ని ఇవ్వడానికి ఆయన మనలో జీవాన్ని ఊదలేదు. అయితే ప్రభువైన యేసు ద్వారా మనం తిరిగి జన్మించినప్పుడు ఆయన మనలో నూతన జీవాన్ని అనుగ్రహించాడు. మునుష్యుల హృదయాలను మార్చడానికీ, వారి మనస్సులను పునరుద్ధరించడానికీ ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుణ్ణి మనం కలిగియుండడం మన జీవితాలను ఆయనను తెలియకుండా ఉన్న జీవితం కంటే భిన్నంగా చెయ్యాలి.

"పిండి వంట” యొక్క రుజువు తినడంలో ఉంది" అని ఒక పాత సామెతను మనమందరం విన్నాము, అదేవిధంగా, దేవుడు మనతో అన్ని సమయాలలో ఉన్నాడు అనేదానికి రుజువు మనలను గమనించే లోకానికి మన జీవితాలు ఏవిధంగా కనిపిస్తున్నాయి అనేదే. క్రీస్తు మనలోనూ, మనము ఆయనలోనూ నివసిస్తున్నట్లయితే, ఆయన ఎవరో, ఆయన గురించి ఏమిటో అనేదానిని మన జీవితాలు ఆచరణీయ నిరూపణగా ఉండాలి కదా! యోహాను సువార్త 10 వ అధ్యాయంలో 10 వ వచనంలో శత్రువైన సాతానుడు దొంగిలించడానికీ, చంపడానికీ, నాశనం చేయడానికీ ఏవిధంగా వస్తాడు అని చెపుతుంది అయితే ఆయన (ప్రభువైన యేసు) సమృద్ధి జీవాన్ని తీసుకురావడానికి వచ్చాడో చెపుతుంది.

దేవుడు ఎల్లప్పుడూ సజీవుడు, మన జీవితాలలో పాల్గొంటున్నాడనే దానికి ఈ సమృద్ధి జీవం ఒక సజీవమైన రుజువు. సమృద్ధియైన జీవితం ధనసంపదతోనూ, విజయాలూ లేదా ప్రభావంతోనూ నిండియుండాల్సిన అవసరం లేదు. ఇది అల్లకల్లోలం మధ్య శాంతినీ, ఎదురుదెబ్బలలో ఆనందాన్నీ, శ్రమల మధ్య ఉద్దేశాన్నీ కలిగియుండేదిగా ఉంది. క్రీస్తు పరిమళాన్ని కలిగి ఉన్న ఒక జీవితం, తద్వారా మనల్ని ఎదుర్కునే వారెవరైనా మొదట ఆయనను చూస్తారు. ఇది విశ్వాసం మీద స్థాపించబడిన జీవితం యొక్క లోతైన సంభాషణలకు ప్రశ్నలను రేకెత్తిస్తుంది, ద్వారాలు తెరుస్తుంది.

 

ఇది మన జీవితకాలానికి మించిన ఉద్దేశ్యం, రాబోయే తరాలను ప్రభావితం చేసే జీవితం.

క్రీస్తు మనకు ఏమి అవుతాడు అనే సందేశం విషయంలో మన జీవితాలు మన సామాజిక మాధ్యమాల ప్రసారాలకంటే బిగ్గరగా మాట్లాడును గాక! జనాదరణ పొందిన సంస్కృతి కొన్నింటిని సత్యంగా చిత్రీకరిస్తుంది వాటి కంటే మన జీవితాలు బిగ్గరగా మాట్లాడును గాక! శత్రువు మన తరాన్ని గందరగోళపరిచిన అబద్ధాల కంటే మన జీవితాలు బిగ్గరగా మాట్లాడును గాక! మన జీవితాలే ఇతరులు చదివిన ఏకైక బైబిలు కావచ్చు, కాబట్టి మనం ఏమి చేస్తున్నాం లేదా జీవితంలో ప్రస్తుతం ఎక్కడ ఉన్నామనే దానితో సంబంధం లేకుండా మనం ఎలా జీవిస్తున్నాము అనేది ప్రాముఖ్యం.

ఈ ఆగమనం సమయంలో మనలో నూతన జీవాన్ని కలిగియుండడానికి మనం దేవుణ్ణి ప్రార్థించవచ్చు. తద్వారా నూతన సంవత్సరంలోనికి అడుగుపెడుతున్నప్పుడు మనం తెప్పరిల్లుతాము, నూతన ప్రదేశాన్ని పొందడానికి పునరుద్ధరించబడతాము, నూతన ప్రాంతాలను స్వాధీనపరచుకొని, ఉన్నత దేహులను జయిస్తాము. అంతేకాకుండా క్రీస్తు పరిమళాన్ని మనల్ని  కనీసం ఒక్క నిమిషం అయినా కలుసుకున్న వారికి మనం దానిని ప్రసరింప చేస్తాము. 

ప్రార్థన:

ప్రియమైన ప్రభువా,

ప్రభువైన యేసును మాతో ఉండటానికి పంపినందుకు వందనాలు. నాలో నూతన విశ్వాసాన్ని పుట్టించి, నా హృదయాన్ని నీ వైపుకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికోసం వందనాలు. నాలో ఉన్న స్వార్థం లేదా గర్వాన్ని బట్టి నన్ను క్షమించు- నేను మీ కోసం, మీ మహిమ కోసం మాత్రమే నా జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నాను.

యేసు నామంలో

ఆమేన్.

రోజు 4

ఈ ప్రణాళిక గురించి

దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళిక

మనం ప్రపంచం అనిశ్చిత సమయాలలోనూ, తలకిందులైన సమయాలలోనూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితాలు దేవుని కుమారుడైన యేసు కోసం కానట్లయితే, మనకు ఎటువంటీ ఆశాభావం ఉండదు. ప్రతి క్రిస్మస్ మనకు ఇమ్మాన్యుయేలును జ్ఞాపకం చేస్తుంది – దేవుడు మనతో ఉండే బహుమతి, ఇస్తూనే ఉన్న బహుమతి. ఇప్పటినుండి శాశ్వతకాలం వరకూ మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండము, వేడుకచేసుకోవడం ఎంతైనా యోగ్యమైనదే.

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in