దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళికనమూనా
మత్తయి సువార్త
మనలను నడిపించడానికి దేవుడు మనతో ఉన్నాడు
అపొస్తలుడైన మత్తయి సువార్త ప్రకారం యేసు జననానికి దారితీసిన సంఘటనలూ, జనన సమయంలో జరిగిన కార్యాల కథనాలూ వేగవంతమైన ఒక నవల లాంటిదిగా ఉంది. ఆయన భూసంబంధమైన వంశ క్రమం ప్రామాణికమైనదని మనం చూడడానికి మనం ఒక వంశపారంపర్య వివరణను చూడగలము. తరువాత ఆయన తండ్రి వివరణను చూడగలము. గర్భంధరించిన యేసు తల్లి మరియను వివాహం చేసుకోవడం గురించి యోసేపుకున్న అపోహలను గురించి చూడవచ్చు. వీటి తరువాత జరిగిన ప్రతీ సంఘటనలోనూ దైవిక హస్తం కదలికను మనం చూడవచ్చు, మనుష్యులు తాము వెళ్ళవలసిన విధానంగా వెళ్ళడంలో నడిపించడానికీ, దేవుని చిత్తం కేంద్రంలో ఉండడానికీ ఆయన నడిపించిన విధానం మనం గమనించవచ్చు.
మరియను వివాహం చేసుకోవాలని కలలో దేవుని దూత యోసేపుకు తెలియపరచి నడిపించాడు. తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులైన మునీశ్వరులు యేసు జన్మించిన ప్రదేశానికి ఒక నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు. హేరోదుకు ఈ శిశువు విషయంలో హానికరమైన ఉద్దేశాలు ఉన్నందున అతని దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని కలలో ఈ జ్ఞానులు హెచ్చరించబడ్డారు. పసిపిల్లలను బుద్ధిహీనంగా ఊచకోతకు గురిచేయాలని హేరోదు తన ఉగ్రతను ప్రదర్శిస్తుండగా యోసేపు తిరిగి బేత్లెహేము నుండి పారిపోయి ఐగుప్తులో నివసించాలని ఒక కలలో దూత చెప్పాడు. పరిస్థితులు స్థిరపడినప్పుడు యూదాకు తిరిగి వెళ్లాలని యోసేపుకు దూత తరిగి తెలియపరచాడు, కాబట్టి కుటుంబం నజరేతులో స్థిరపడింది.
హృదయపూర్వకంగానూ విదేయులుగానూ ఉన్న మనుషులను దేవుడు నడిపిస్తూ ఉండడం ఇక్కడ మనము చూస్తున్నాము. తద్వారా ఆయన పరిపూర్ణ ప్రణాళికలు వారిలోనూ, వారి ద్వారానూ పూర్తి చెయ్యబడుతున్నాయి. దేవుడు మనతో ఉండడం యాదృచ్చికమైనదీ లేదా అనుకోకుండా జరిగినదీ కాదు. అయితే ఆయన మనతో ఉండడం స్పష్టంగా హేతుబద్ధమైన, ఉద్దేశపూర్వక నిర్ణయం. మన జీవితాలలో ఆయనను ప్రభువుగానూ, రక్షకునిగానూ అంగీకరించినప్పుడు ఆయన మనలో నివసించడానికీ, మనతో జీవించడానికీ ఎంచుకొంటున్నాడు. మన జీవితాలను ఆయన వైపు మళ్లించాలనే మన నిర్ణయం ఆయనకు మన జీవితాలమీద పూర్తి అధికారాన్నీ, పరిపాలననూ ఇవ్వడానికి ఇష్టతచూపించడమే.
బండిని నడిపించే స్థానాన్ని ఆయన తీసుకొన్నప్పుడు మనం ఆయన పక్కన కూర్చుని సవారీని మనం ఆస్వాదిస్తాము. (వెనుక కూర్చొని బండిని నడిపించడం ఇక్కడ లేదు). మన జీవితంమీద సర్వోన్నతమైన పాలన కలిగియుండడం ద్వారా మనం బుద్ధిహీనంగా ఒకరిని అనుసరించము కాని విషయాలను మనం భిన్నంగా చూడటం మొదలుపెడతాము, నూతనమైన వాటి ద్వారానూ, మనకు తెలియని పరిస్థితుల ద్వారానూ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మార్గాలను ఉన్నతంగా సరిచేస్తూ ఆయన మనకు నాయకత్వం వహించి మనలను నడిపించడం గుర్తించడం అనేది ఒక గంభీరమైన అంశం. మన సంబంధాలలోనూ, మన వృత్తులలోనూ, మన విద్యలోనూ, మన ఎంపికలలోనూ, మనం ఆయనను అనుమతించినట్లయితే మన కోరికలలోనూ ఆయన మనలను నడిపిస్తాడు. మనం ఆయనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన మనలను నడిపిస్తాడు. మనలను కదిలించడానికి మనం ఆయనకు అవకాశాన్ని ఇచ్చినట్లయితే ఆయన మనలను ముందుకు నడిపిస్తాడు. మనం వినయంగానూ, విధేయులంగానూ, ఆతృతగానూ ఉండడం ఆయన కనుగొన్నప్పుడు మనలను సంతోషంగా నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని నడిపించడానికి మీరు ఎంత వరకూ సిద్ధపడి ఉన్నారు?
మోషే, యెహోషువల కాలంలో, తన ప్రజలు భయపడకూడదని దేవుడు చెపుతూ వచ్చాడు, ఎందుకంటే ఆయన వారితో ఉన్నాడు. పగలు మేఘస్థంభం ద్వారానూ, రాత్రి వేళ అగ్ని స్థంభం ద్వారానూ ఆయన వారిని అనుదినమూ నడిపించాడు. ఆయన వారిని యుద్ధాలలోనికి నడిపించాడు, వారి పక్షంగా ఆయన యుద్ధం చేసాడు. దావీదు రాజు, ఇతర కీర్తనాకారులూ మన జీవితాలలోని ప్రతీ కాలంలోనూ ఉండే నిరంతర దేవుని సన్నిధిని గురించి కీర్తనలు రాశారు. తండ్రియైన దేవుడు మంచి గొర్రెల కాపరిగా ప్రభువైన యేసు పోల్చి చెప్పాడు. ప్రతీ గొర్రె పేరూ ఆయనకు తెలుసు, ఆయన వాటిని పచ్చిక బయళ్ళ వద్దకు మృదువుగా నడిపిస్తాడు. కాబట్టి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ దేవుడే. ఆయన మన జీవితాలలో పాలుపంచుకొంటున్నాడు, కష్టమైన నిర్ణయాల విషయంలో ఎందుకు మనం బెదరిపోతున్నాము? తరువాత జరుగబోయే దానిని గురించి చింతిస్తూ ఎందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాము? ఇమ్మానుయేలు - దేవుడు మనతో ఉన్నాడు, సమస్త సత్యంలోనికీ, ఆయన పేరును బట్టి నీతిమార్గాలలో నడిపించడానికి వాస్తవంగా ఆయన మనతో ఉన్నాడు. మన జీవితంలోని ప్రతీ సందర్భంలోనూ ఆయన సమయానుకూల నడిపింపు, ఆయన నిరంతర సన్నిధి యొక్క నిశ్చయతనుండి కదిలించలేని మన విశ్వాసం ధైర్యాన్ని తీసుకోగలదా?
ప్రార్థన:
ప్రియమైన ప్రభువా,
నేను వెళ్ళవలసిన మార్గంలో నన్ను నడిపించమని నిన్ను అడుగుతున్నాను. నా జీవితంలో నీకు సంపూర్ణమైన అధికారాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాను. నన్ను అన్ని విధాలా నడిపించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నాతో ఉన్నందున ఈ ప్రయాణంలో నాకు ఆనందాన్నీ, విశ్వాసాన్ని అనుగ్రహించండి.
యేసు నామంలో
ఆమేన్.
ఈ ప్రణాళిక గురించి
మనం ప్రపంచం అనిశ్చిత సమయాలలోనూ, తలకిందులైన సమయాలలోనూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితాలు దేవుని కుమారుడైన యేసు కోసం కానట్లయితే, మనకు ఎటువంటీ ఆశాభావం ఉండదు. ప్రతి క్రిస్మస్ మనకు ఇమ్మాన్యుయేలును జ్ఞాపకం చేస్తుంది – దేవుడు మనతో ఉండే బహుమతి, ఇస్తూనే ఉన్న బహుమతి. ఇప్పటినుండి శాశ్వతకాలం వరకూ మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండము, వేడుకచేసుకోవడం ఎంతైనా యోగ్యమైనదే.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in