రూపాంతర పరచుటకై రూపాంతరం నొందుటనమూనా
సంఘంలో మన పాత్ర
మీలో బేధాలు లేకుండునట్లు ఒకే విషయాన్ని మాట్లాడండి [10 వ వచనం ASV]
దేవుని ద్వారా పొందిన అధికారంతో పౌలు సంఘంలో బేధాల మధ్య వంతెన నిర్మించడానికి సవాలు స్వీకరించాడు. పౌలెప్పుడూ పక్కకి తొలగిపోలేదు ప్రభువును సేవించడంపై మాత్రమే దృష్టి నిలిపాడు. ఈనాడు మనం మన సంఘాల్లో అనేకమైన భిన్న విభిన్నమైన ఉద్దేశ్యాలు అభిప్రాయాలూ మనం కలిగివున్నాం. ఇట్టి వ్యత్యాసాలు తగు రీతిగా వినిపించబడి, వివరించబడి వాటికి న్యాయం జరగాలి. క్రీస్తును వెంబడించుట అనే సాధారణ గురి/లక్ష్యాన్ని మనందరం కలిగివున్నట్టయితే ఎన్ని వ్యత్యాసాలైనా గుర్తించబడతాయి. అభిప్రాయాలలో తలంపులలో తేడాలు బేధాలు కలిగివున్నవారు తమ గురిని కోల్పోయి, దారి మళ్ళి తప్పుడు బోధలకు ఎరయై ముక్కలైన గుంపులను సృష్టించి వాటిలో చేరిపోతారు. ఇట్టి వారు సమకూర్చబడి మూల రాయియైన క్రీస్తులోనికి తమ విశ్వాసం యొక్క ప్రారంభ స్థితిలోనికి తిరిగి రప్పించబడి సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వారు ప్రోత్సహించబడవలసిన అవసరతను కలిగి ఉంటారు. సత్వర సాంకేతిక మార్పులు, శ్రేష్టతలు కలిగిన నేటి కాలానికి క్రీస్తే ప్రాముఖ్యమై యుండాలి.
వారు క్రీస్తు వైపు మాత్రమే తమ దృష్టిని నిలిపి ఉంచటానికి క్రీస్తే అంతిమ ప్రత్యక్షతయనే సత్యాన్ని ప్రజలు గుర్తించడానికి మన అనుభవాలు వారికి ప్రేరణాత్మకమై యుండాలి. దేవుని సత్య మార్గంలోనికి ఇతర ఆచారాలు, సాంప్రదాయాలు చొరబడకుండా క్రీస్తును మాత్రమే మహిమపరిచే విధంగా అధికారంతో మనం సువార్తను ప్రకటించవలసియున్నాం.
మనం మన వంతు పని నెరవేర్చిన తరువాత దేవుడే తన శక్తిని కనబరచనివ్వాలి
పౌలు మీ కోసం సిలువ వేయబడలేదు.
మనమింకను పాపులమై యుండగా క్రీస్తు మన కొరకు సిలువపై చనిపోయాడు ఏ దైవజనుడు, ఏ ధర్మ శాశ్త్రోపదేశకుడు ఇట్టి కార్యం చేయలేదు. అన్నిటిలో క్రీస్తే మహిమపరచబడాలి మరి ఏ మనుష్యుడు కాదు ప్రజలు తరుచూ అద్భుతాల వైపు చూస్తూ వున్నారు, వివాదాలు, సైద్ధాంతిక వేదాంతాలకు వారు గురై యున్నారు. కనిపించే వాటి పట్ల మాత్రం విశ్వాసం కలిగివున్నారు. ఎక్కడైతే క్రీస్తు మరణించాడో వారిని మనం ఆ సిలువ వైపుకు త్రిప్పడం ఎంతో ప్రాముఖ్యం. దేవుని ప్రేమ, శక్తి కనబరచబడే అద్భుతం ఇదే అయ్యుంది.
కాబట్టి దేవునిచే పిలువబడిన మనం జ్ఞానులమనో బలవంతులమనొ తలంచక దీనులమై తగ్గించుకొని, లోకంలోని జ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచడానికి అజ్ఞానులము, బలహీనులము అయిన మనలను పిలుచి వున్నాడనే విషయాన్ని గుర్తించాలి.
“లోకంచే తృణీకరించబడిన” మనలను దేవుడు ఏర్పరచుకొన్నాడనే సత్యాన్ని గుర్తించి ఆయన మన హృదయాలను పరిపాలించి, తన ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మనం జీవించడానికి మనకు సహాయం చేసేటట్లు, తన మహిమార్ధం మన జీవితాలను వినియోగించడానికి దేవుడు అధికారం కలిగి ఉండునట్లు మనం ఆయనను అనుమతిద్దాం.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
దేవుని పిలుపును పొంది ఆయన సంకల్పాలను అర్ధం చేస్కోవడం, సాక్ష్య జీవితాన్ని జీవించటం, రక్షణా ర్ధమైన దేవుని కృపను గూర్చి ఇతరులకు తెలియజేయడం, రానై యున్న నిరీక్షణతో ప్రస్తుత కాలములు లేక పరిస్థితులను దాటి వెళ్ళడం, దేవునిచే ఏర్పరచబడిన పాత్రగా యోగ్యమైన జీవితాన్ని జీవించడం, సంఘంలో ఐక్యతను విస్తరింపజేస్తూ క్రీస్తును మాత్రమే సంఘానికి శిరస్సుగా వుండనివ్వడం మరియు దేవుని వాక్యాన్ని ప్రకటించడం, బోధించడం.
More
ഈ പദ്ധതി നൽകിയതിന് സി ജെബരാജിന് നന്ദി പറയാൻ ഞങ്ങൾ ആഗ്രഹിക്കുന്നു. കൂടുതൽ വിവരങ്ങൾക്ക്, സന്ദർശിക്കുക: http://jebaraj1.blogspot.com/