రూపాంతర పరచుటకై రూపాంతరం నొందుటనమూనా
దేవుని పిలుపు మన వ్యక్తిగత రూపాంతర స్థితి [మార్పు]
పౌలు, దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపొస్తలుడుగా పిలువబడ్డాడు
దేవుని చేత పిలువబడక మునుపు పౌలు సంఘాన్ని [దేవుని ప్రజలను] హింసించుటయనే ఉద్యమాన్నికలిగివున్నాడు. యేసు క్రీస్తు అనుచరులను హింసించటానికి యూదా మతాధికారులు పౌలుకు అధికారాన్నిచ్చివున్నారు. అతడు దమస్కు దారిలో వున్నపుడు దేవుడు పౌలును ఎదుర్కొని అసలు అతడు ఏ విధంగా వున్నాడు, ఏమై యుండాలి అనే విషయాలు తెలియజేసాడు. దేవుడు తనను ఎదుర్కొన్న ఆ అనుభవం అతడిని వ్యక్తిగతంగా రూపాంతర పరచి, దేవుని స్వరానికి విధేయుడుగానూ, ఇతరుల విలువను గుర్తించేవాడిగానూ మార్చింది. ఆ పై అతడు అప్పటివరకూ వున్నట్టుగా లేడు.
పౌలు మార్పు చెందిన తరువాత, తాను ఒకప్పుడు హింసించిన తరువాత కొరింథీయులకు పత్రిక రాస్తూ వారిని “క్రీస్తు యేసునందు పరిశుద్ధులని” పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవారని సంబోధించాడు 2వచనం]. అన్ని వైవిధ్యాల్లోనూ అతడు క్రీస్తు శరీరాన్ని దేవుడికి చెందినది గానూ ఆ దేవుడే యూదులకు చెందిన వాడుగానూ అదే విధంగా అన్యజనులకు చెందినవాడు గానూ చూడటం మొదలుపెట్టాడు. దేవుని ప్రజలు దేవుని కృపను, సమాధానాన్ని అనుభవించే స్థలంగా సంఘాన్ని ప్రశంసించాడు. తన పత్రికలన్నిటిలో దేవుని కృపా సమాధానాలు సంఘానికి తోడై యుండాలని పౌలు ప్రార్ధిస్తూ వచ్చాడు. క్రీస్తు అనుచరుల ఆధునిక సంఘం నేటికీ అదే ప్రార్ధనను కలిగివున్నది.
సంఘాన్ని హింసించే స్థాయి నుండి పౌలు సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా మారాడు. దేవుడతన్ని ఎదుర్కొన్నప్పటినుండి అతడి జీవితం ఒక ప్రత్యేకమైన రూపాన్నిసంతరించుకొంటూ వచ్చింది. తనను ఎదుర్కొన్నదేవున్నేహింసించే పనిలో అతడుండగా అతనికి దేవుని దర్శనం కలుగుతుందనేది అతడు వూహించలేనిది. తరుచుగా మనం దేవునిపై తిరుగుబాటు చేస్తూ వుంటాం అలాంటపుడే దేవుడు మనల్నిఎదుర్కొంటూ ఉంటాడు, మనం ఏ విధంగా వున్నాం మరి ఏ విధంగా వుండవలసియున్నాం మొదలైన విషయాలు దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు ఆయన తన కృప ననుసరించి మనం రూపాంతరపరచ బడడానికి మనల్ని యోగ్యులుగా చేస్తూ ఉంటాడు దేవునికి విధేయులై పాతమార్గాల నుండి మళ్లుకొని మార్పు చెందడానికి సంసిద్దులం కావాలి దేవుడు మన జీవితంలో పని చేయడానికి మనం ఆయనను అనుమతించినట్టయితే మన పాత స్వార్ధ స్థితిని మన వెనుక పారవేసి మనకు మాత్రమే గాక రానున్న తరాలకు మనం ఆశీర్వాద కరంగా వుండే టట్లు మనకొక సరి కొత్త జీవితాన్ని అనుగ్రహించడంలో ఆయన నమ్మదగిన దేవుడై యున్నాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
దేవుని పిలుపును పొంది ఆయన సంకల్పాలను అర్ధం చేస్కోవడం, సాక్ష్య జీవితాన్ని జీవించటం, రక్షణా ర్ధమైన దేవుని కృపను గూర్చి ఇతరులకు తెలియజేయడం, రానై యున్న నిరీక్షణతో ప్రస్తుత కాలములు లేక పరిస్థితులను దాటి వెళ్ళడం, దేవునిచే ఏర్పరచబడిన పాత్రగా యోగ్యమైన జీవితాన్ని జీవించడం, సంఘంలో ఐక్యతను విస్తరింపజేస్తూ క్రీస్తును మాత్రమే సంఘానికి శిరస్సుగా వుండనివ్వడం మరియు దేవుని వాక్యాన్ని ప్రకటించడం, బోధించడం.
More
ഈ പദ്ധതി നൽകിയതിന് സി ജെബരാജിന് നന്ദി പറയാൻ ഞങ്ങൾ ആഗ്രഹിക്കുന്നു. കൂടുതൽ വിവരങ്ങൾക്ക്, സന്ദർശിക്കുക: http://jebaraj1.blogspot.com/