ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంనమూనా
దుఃఖపడువారు ధన్యులు
దుఃఖపడువారు ఒదార్చపడతారు అని వాగ్దానం వారికి అనుగ్రహింపబడింది.
మనమందరం దుఃఖాన్ని అనుభవిస్తాము. పతనమైన లోకంలో మనం జీవిస్తున్న కారణంగా ఇది నిశ్చయంగా జరిగే అనుభవం. చరిత్రలోని ఈ సమయంలో దుఃఖం మీద వ్యాఖ్యానం చెయ్యడం సాధారణం అయినప్పటికీ, దానిని పూర్తిగా విస్మరించవచ్చు. సామాజిక మాధ్యమం, ఆన్‌లైన్ కొనుగోలు, అమ్మకాలు, భోజన పదార్ధాలు వంటి ఆటంకాలతో దుఃఖాన్ని తగ్గించడానికీ, అది ఉనికిలో లేదన్నట్టుగా నటించడం సాధ్యం అవుతుంది. మన దుఃఖాన్ని మూగగా ఉంచడం లేదా తివాచీ కింద ఉంచాలని దేవుడు కోరడం లేదని గుర్తించేలా ఈ ధన్యత చేసింది. భారమైన దుఃఖ భారం విషయంలో మనం దుఃఖించాలని దేవుడు కోరుతున్నాడు. విరిగిన సంబంధంపై గానీ, లేదా మాట చెప్పకుండా ఇంటిని విడిచిపెట్టిన చిన్నబిడ్డను గురించి గానీ, లేదా మరమ్మత్తు చేయలేని మీ ఆర్థిక పరిస్థితులను గురించి గానీ, మీరు ఎదుర్కొన్న హింసను గురించిగానీ మీరు దుఃఖించారా?
ఈ దుఃఖం నిర్లక్ష పెట్టబడేది కాదు అయితే దేవుడు చూచేది కనుక దుఃఖపడడం అవసరమని ఈ ధన్యత మనలను ధైర్యపరుస్తుంది. ఆయన మనలను ఓదార్చుతాడని వాగ్దానం చేశాడు.
దేవుడు మన దుఃఖాన్నీ, మన ప్రశ్నలనూ, మన కోపాన్ని కూడా పరిష్కరించగలడు. నిరాశలోని ఆ చీకటి క్షణాల్లో మనం ఆయనకు అనుమతిస్తే ఆయన మనలను తన దగ్గరికి ఆకర్షిస్తాడు.
దేవుడు మనకు అనుగ్రహించే ఓదార్పులోని రమ్యత మన దుఃఖం మనల్ని ఇకమీదట నిర్ధారించదు, అయితే మన విషయంలో ఆయన కోరుకొనే వ్యక్తిగా ఉండడానికి రూపొందిస్తుంది.
మనకోసం దుఃఖించడం ముఖ్యం అయితే మన చుట్టూ ఉన్న అవసరాలకు మనం స్పందించడాన్ని మనం అనుమతించాలి. దేశం లేదా దాని ప్రవక్తలు వారి అనేక పాపాలకూ, దుష్టత్వానికీ సంతాపం తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయని బైబిలు నమోదు చేసింది. అవినీతి, ద్వేషం, దుష్టత్వం చేత ఆక్రమించబడుతున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ప్రభువును ప్రేమిస్తున్న మనం మన ప్రపంచంలోని సమస్యల గురించి స్పందించాలి, అది మనలను తాకనందున ఆత్మసంతృప్తి చెందడం మానేయాలి. మనం క్రీస్తులాగే ఉండాలంటే బాధతో ఏడుస్తూ, వారి బాధలను తీర్చడానికి మనం చేయగలిగినది చేయాలి.
ఈ రోజు మీ గాయాలను దేవుని వద్ద తెరవడానికి మీరు సమయం తీసుకుంటారా – ఆదరణ కర్త అయిన దేవునికి ఏదీ గజిబిజిగా గానీ, చాలా క్లిష్టంగాగానీ లేదా అసౌకర్యంగా గానీ ఉండదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులూ, వారి అవసరాలకు స్పందించడానికి మిమ్మల్ని మీరు అనుమతిస్తారా? ఒకరి ప్రార్థనలకు మీకు సమాధానం కావచ్చు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in