ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంనమూనా

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

10 యొక్క 6

కనికరము గలవారు ధన్యులు 

కనికరము గలవారు ఇతరుల విషయంలో స్థిరంగా కరుణ చూపించేవారుగా ఉన్నవారు. వారు క్షమించబడ్డారనీ,  దైవిక కరుణ పొందారూ అనే వాస్తవాన్ని వారు ఎప్పటికీ మరచిపోరు. కాబట్టి వారు దానిని ఎటువంటి నింద లేకుండా ఇతరులకు విస్తరిస్తారు. ప్రతిగా వారు దేవునినుండీ, మనుష్యుల నుండీ కరుణను పొందుతారు. ప్రపంచంలో మనల్ని ప్రత్యేకపరచే లక్షణం ఏమిటంటే, ప్రజలపై తీర్పును ఇవ్వకుండా వారిపట్ల నిజంగా శ్రద్ధ చూపించే సామర్థ్యం. కనికరంలేని సేవకుడి ఉపమానంలో, సేవకుడి అర్థరహిత పూర్తి ప్రవర్తనను ప్రభువు ఎత్తిచూపాడు, యజమాని అతని గొప్ప రుణాన్ని క్షమించాడు, ఆ సేవకుడు తనకు అత్యల్పంగా అప్పు ఉన్న తన తోటి సేవకుని గొంతు పట్టుకొన్నాడు. తోటి పురుషుడికీ లేదా స్త్రీకీ కరుణ చూపించే అవకాశం వచ్చిన ప్రతిసారీ ఈ కథ మనలను నిరోధిస్తూ ఉండాలి. కరుణ చూపించడం వల్ల మనక ఏమీ ఖర్చు కాదు అయితే అది గ్రహీతకు మాత్రం అత్యధికమైన మార్పును తీసుకొనివస్తుంది.

ఈ రోజు మీరు ఎవరిపట్లనైనా కరుణను చూపించకుండా నిలిపివేసిన ఒక వ్యక్తి గురించి ఆలోచించగలరా, వారి గతం గురించి లేదా వారి ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు తెలిసినా ఎటువంటి తీర్పు లేకుండా వారి పట్ల శ్రద్ధ చూపించదానిని అదనపు ప్రయత్నం చెయ్యగలరా?

Day 5Day 7

ఈ ప్రణాళిక గురించి

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in