జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుమునమూనా

జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము

7 యొక్క 5

నీవెందుకు భయపడుదువు?

ఈ రోజు దేవుడు నీ కొరకు ప్రత్యేకమైన వాక్కు వుంచాడని నేను భావిస్తున్నాను...

"ఈ దినము సుందరమైనది. నన్ను చేరుకుంనట్లు ఆటంక పరచు దానినిబట్టి నీవు వ్యసనపడుచున్నావు. దీని గూర్చి ఆలోచించుము: నేనింకను సింహాసనముపై ఉన్నాను. విశ్వమంతటినీ పరిపాలించుచున్నాను. నేనే యేసు. శరీరధారియైన దేవుని కుమారుడను. మరియు దేవుని కుడిపార్ష్వమున కూర్చండియున్నాను   కేంద్రముగా ఉన్నాను అన్నింటిని స్వాధీనమునందుంచుకొని యున్నాను"

"నా ప్రియమైన బిడ్డా,నీవు నాకెంతో ప్రశస్తము. నీ మంచి కొరకు సమస్తమును సరిగా నుండునట్లు చేయుదును"( రోమ 8:28).

"మిమ్మును బాధపెడుతున్నవాటన్నిటిని నాకిచ్చి వేయుము.  నీ సమస్యలను బట్టి భయపడకుము.దానికి బదులుగా వాటిని నీ ప్రార్థన యొక్క అంశములుగా చేసికొనుము. వాటిని మోసుకొని పోకుము వాటిని నా యొద్దకు తీసుకొని రమ్ము" (1పేతురు 5:7)

"నన్ను వెతుకుము నీవు నన్ను కను గొనెదువు (యిర్మియా 29:13-14)

"రండి నా పాదముల వద్ద కూర్చుండి.పరిస్థితులను కలవరము, కష్టములను ప్రక్కన బెట్టుము. "నేను ఉన్నవాడను". అనునదే నా పేరు.నీ కవసరమైనదంతయు నేనే! నీవు వేచియుండు శాంతి నేనే. సమృద్ధిగల జీవముగల వాడను. నీవు వెదుకుచున్న సంతోషము నేనే (యోహాను10:10)

రండి...నేనిక్కడే యున్నాను.

ఈ వాక్య సందేశము నిన్ను తాకగలిగితే నాతో కలిసి ప్రార్థించ కోరుచున్నాను... "యేసు, నేనిక్కడే ఉన్నాను. నీ పిలుపునకు జవాబు నిచ్చు చున్నాను. ఇక ఏ మాత్రము నా సమస్యలను, తలంపులను మోసుకొని పోవుట కిష్టపడను. నా భయము, తలంపు, ఓటమి, కష్టము, బాధ, ఒత్తిడి అన్నింటిని నీకిచ్చుచున్నాను. సమస్తమును నీకిచ్చుచున్నాను. వాటిని తీసుకొనుము ప్రభువా. నన్ను తప్పించుము, యేసూ! నీ సహాయము, నీ ప్రేమ కొరకు వందనములు.  అన్నిటియందు నీవు కేంద్రముగా నున్నందుకు వందనములు. నీ పేరటనే... ఆమెన్”

Day 4Day 6

ఈ ప్రణాళిక గురించి

జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము

భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే”. భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను!

More

ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/