శోధననమూనా
"అపవాది నాతో యిది చేయించాడు!" ఇది శోధనలకు లొంగిపోయినప్పుడు లేదా వాటి మీద నియంత్రణ తప్పిపోయినప్పుడు, చాలా మంది తమను తాము సమర్థించుకోడానికి వుపయోగించే ఒక సాకు. శత్రువు ప్రజలను నాశనం చెయ్యడానికి భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనేది నిజమే అయినా, క్రీస్తు అనుచరులు తమలో నివసిస్తున్న దేవుని శక్తి కలిగి వున్నారు అనునది కూడా సత్యమే. శోధించబడడం తప్పా? మీరు శోధనకు లొంగిపోతే లేదా దాని మీద నియంత్రణ తప్పితే, దానికి ఎవరు బాధ్యులు? ఒక కఠినమైన పరిస్థితిలో మిమ్మల్ని మీరు కనుగొన్నప్పుడు మీకు ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు వున్నాయా? బైబిలు గ్రంథంలో శోధన గురించి మరియు స్వయం నియంత్రణ గురించి చాలా వివరించడినది. వాక్యమును త్రవ్వి తెలుసుకోండి .
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
శోధన అనేక రూపాల్లో వస్తుంది. మన నిర్ణయాలను మన్నించుకోవడం మరియు మనల్ని మనం సమర్థించుకోవడం చాలా సులభం. ఈ ఏడు రోజుల ప్రణాళిక దేవుని ఆత్మ ద్వారా మీరు శోధనను అధిగమించగలరని చూపిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా వుంచడానికి కాస్త సమయం తీసుకొని, దేవుడిని మీ జీవితంలో మాట్లాడనివ్వండి. అప్పుడు మీరు అతిగొప్ప శోధనలను అధిగమించడానికి శక్తి పొందుతారు.
More
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.life.church దర్శించండి