కీర్తనలు 89:19-29

కీర్తనలు 89:19-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి –నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధైతెలముతో అతని నభిషేకించియున్నాను. నా చెయ్యి యెడతెగక అతనికి తోడై యుండును నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు. అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రముమీద అతనిచేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను. –నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాచేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును. శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.

కీర్తనలు 89:19-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ, మీకు నమ్మకమైన వారితో మీరిలా అన్నారు: “నేను వీరుడికి సాయం చేశాను. ఒక యువకుడిని ప్రజల్లో నుండి లేవనెత్తాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను; నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను. అతనికి నా చేయి తోడుగా ఉంది; నా బాహువు అతన్ని బలపరుస్తుంది. శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు; దుష్టులు అతన్ని అణచివేయలేరు. అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను, అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను. నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి, నా నామాన్ని బట్టి అతని కొమ్ము హెచ్చంపబడుతుంది. నేను అతని చేతిని సముద్రం మీద, అతని కుడి హస్తాన్ని నదుల మీద ఉంచుతాను. ‘మీరు నా తండ్రి, నా దేవుడు నా కొండ, నా రక్షకుడు’ అని అతడు నాకు మొరపెడతాడు. అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చూసుకుంటాను, భూరాజులందరిలో అతన్ని మహా ఉన్నతమైనవానిగా చేస్తాను. నేను అతని పట్ల నా మారని ప్రేమను నిత్యం కొనసాగిస్తాను, అతనితో నా నిబంధన స్థిరమైనది. అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను, అతని సింహాసనం ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది.

కీర్తనలు 89:19-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు. నువ్విలా అన్నావు, నేను ఒక శూరుడికి కిరీటం పెట్టాను. ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను. నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను. నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు. అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను. నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది. సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను. నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు. నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను. నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది. అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.

కీర్తనలు 89:19-29 పవిత్ర బైబిల్ (TERV)

కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు. నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను. ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను. నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను. మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను. ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు. దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు. అతని శత్రువులను నేను అంతం చేసాను. ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను. ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను. నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను. ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను. నదులను అతడు అదుపులో ఉంచుతాడు. ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’ అని అతడు నాతో చెబుతాడు. మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను. భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు. ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది. అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు. అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.

కీర్తనలు 89:19-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి –నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధైతెలముతో అతని నభిషేకించియున్నాను. నా చెయ్యి యెడతెగక అతనికి తోడై యుండును నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు. అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రముమీద అతనిచేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను. –నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాచేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును. శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.

కీర్తనలు 89:19-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)