కీర్తనల గ్రంథము 89:19-29

కీర్తనల గ్రంథము 89:19-29 TERV

కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు. నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను. ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను. నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను. మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను. ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు. దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు. అతని శత్రువులను నేను అంతం చేసాను. ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను. ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను. నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను. ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను. నదులను అతడు అదుపులో ఉంచుతాడు. ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’ అని అతడు నాతో చెబుతాడు. మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను. భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు. ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది. అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు. అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.