కీర్తనలు 55:1-9

కీర్తనలు 55:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను. ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అను కొంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.

కీర్తనలు 55:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి; నా మనవి విని నాకు జవాబివ్వండి. నా ఆలోచనలతో నాకు నెమ్మది లేదు. నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి, దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు; వారు నన్ను శ్రమ పెడుతున్నారు వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు. నా హృదయం నాలో వేదన పడుతుంది; మరణభయం నన్ను చుట్టుకుంది. భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి; భీతి నన్ను ముంచేస్తుంది. “ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే! ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా! నేను దూరంగా ఎగిరిపోయి ఎడారిలో ఉండేవాన్ని. సెలా గాలివానకు తుఫానుకు దూరంగా, నా ఆశ్రయ స్థలానికి తప్పించుకుని త్వరగా వెళ్తాను.” నాకు పట్టణంలో హింస, గొడవలు కనబడుతున్నాయి, ప్రభువా, దుష్టులను గందరగోళానికి గురి చేయండి, వారి మాటలను తారుమారు చేయండి.

కీర్తనలు 55:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు. నా మనవి విని నాకు జవాబు ఇవ్వు. నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు. ఎందుకంటే నా శత్రువులు చేస్తున్న పెద్ద శబ్దాల వల్ల, దుర్మార్గులు చేస్తున్న బలాత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను. వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాలపాలు చేస్తున్నారు. ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు. నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది. దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది. ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను. పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను. పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.

కీర్తనలు 55:1-9 పవిత్ర బైబిల్ (TERV)

దేవా, నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు. దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము. నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు. నాలో నా గుండె అదురుతోంది. నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది. నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను భయపడిపోయాను. ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా. నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును. నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును. నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము. ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.

కీర్తనలు 55:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను. ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అను కొంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.

కీర్తనలు 55:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)