కీర్తనలు 55:1-9

కీర్తనలు 55:1-9 TELUBSI

దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను. ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అను కొంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.