కీర్తన 55:1-9

కీర్తన 55:1-9 IRVTEL

దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు. నా మనవి విని నాకు జవాబు ఇవ్వు. నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు. ఎందుకంటే నా శత్రువులు చేస్తున్న పెద్ద శబ్దాల వల్ల, దుర్మార్గులు చేస్తున్న బలాత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను. వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాలపాలు చేస్తున్నారు. ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు. నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది. దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది. ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను. పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను. పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.