కీర్తనలు 21:8-13

కీర్తనలు 21:8-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మీ చేయి మీ శత్రువులందరినీ పట్టుకుంటుంది; మీ కుడిచేయి మీ శత్రువులను ఆక్రమిస్తుంది. మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు, మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు. యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు, ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది. భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు, నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు. వారు మీకు వ్యతిరేకంగా కీడు చేయాలని కుట్రపన్నినా దుష్ట పన్నాగాలు వేసినా, వారు విజయం సాధించలేరు. మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు. యెహోవా, మీ బలంలో మీరు లేవండి; మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము.

కీర్తనలు 21:8-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ నీ కుడిచెయ్యి పట్టుకుంటుంది. నువ్వు నీ కోపసమయంలో అగ్నిగుండంలో వాళ్ళను దహిస్తావు. తన ప్రచండ కోపంలో యెహోవా వాళ్ళను లయం చేస్తాడు, ఆ అగ్ని వాళ్ళను దహించేస్తుంది. భూమిమీద ఉండకుండా వాళ్ళ పిల్లలనూ, మానవ జాతిలో ఉండకుండా వాళ్ళ వంశస్థులనూ నువ్వు నాశనం చేస్తావు. వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు. ఒక రహస్య పథకం పన్నారు గాని అది సఫలం కాలేదు. నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు. యెహోవా, నీ బలాన్నిబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో. నీ శక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తాము.

కీర్తనలు 21:8-13 పవిత్ర బైబిల్ (TERV)

రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు. నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది. నీవు కనబడినప్పుడు ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు. యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది. మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు. ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి. వారు భూమి మీద నుండి తొలగిపోతారు. ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు. చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు. కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు. ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు. యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.

కీర్తనలు 21:8-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించు కొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురు తన కోపమువలన యెహోవావారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును. భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింప జేసెదవు. వారు నీకు కీడుచేయవలెనని ఉద్దేశించిరిదురు పాయము పన్నిరి కాని దానిని కొనసాగింప లేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు. యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించె దము.

కీర్తనలు 21:8-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)