కీర్తనలు 21

21
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు
చున్నాడు
నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.
2అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు
అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక
అంగీకరించుచున్నావు. (సెలా.)
3శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని
ఎదుర్కొనుచున్నావు
అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచి
యున్నావు.
4ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు
దానిని అతని కనుగ్రహించియున్నావు
సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి
యున్నావు.
5నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను
గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి
యున్నావు.
6నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని
నియమించియున్నావు
నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లిసింపజేసి
యున్నావు.
7ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు
చున్నాడు
సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.
8నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును
నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించు
కొనును.
9నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె
అగుదురు
తన కోపమువలన యెహోవావారిని నిర్మూలము
చేయును
అగ్ని వారిని దహించును.
10భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు
నాశనము చేసెదవు
నరులలో నుండకుండ వారి సంతానమును నశింప
జేసెదవు.
11వారు నీకు కీడుచేయవలెనని ఉద్దేశించిరిదురు
పాయము పన్నిరి
కాని దానిని కొనసాగింప లేకపోయిరి.
12నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు
నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద
కొట్టుదువు.
13యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము
మేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించె
దము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 21: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 21