కీర్తనల గ్రంథము 21:8-13

కీర్తనల గ్రంథము 21:8-13 TERV

రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు. నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది. నీవు కనబడినప్పుడు ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు. యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది. మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు. ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి. వారు భూమి మీద నుండి తొలగిపోతారు. ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు. చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు. కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు. ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు. యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.