కీర్తనలు 136:1-26

కీర్తనలు 136:1-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

కీర్తనలు 136:1-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగేది ఆయన ఒక్కడే. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఎడారి మార్గం గుండా ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఘనత వహించిన రాజులను ఆయన హతం చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. అమోరీయుల రాజైన సీహోనును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. బాషాను రాజైన ఓగును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. వాళ్ళ దేశాన్ని మనకు వారసత్వ సంపదగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సొత్తుగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తనలు 136:1-26 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది. యెహోవా దేవున్ని స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది. జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రున్న్, నక్షత్రాలను చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచివేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు బలమైన రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు అమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. పరలోకపు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

కీర్తనలు 136:1-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును. ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును. అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. బాషానురాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.

కీర్తనలు 136:1-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)