కీర్తనలు 136
136
1యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించుడి
ఆయన కృప నిరంతరముండును.
2దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
ఆయన కృప నిరంతరముండును.
3ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
ఆయన కృప నిరంతరముండును.
4ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు
ఆయన కృప నిరంతరముండును.
5తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను
ఆయన కృప నిరంతరముండును.
6ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు
ఆయన కృప నిరంతరముండును.
7ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు
ఆయన కృప నిరంతరముండును.
8పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను
ఆయన కృప నిరంతరముండును.
9రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను
చేసెను
ఆయన కృప నిరంతరముండును.
10ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను
ఆయన కృప నిరంతరముండును.
11వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను
ఆయన కృప నిరంతరముండును.
12చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను
ఆయన కృప నిరంతరముండును.
13ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను.
ఆయన కృప నిరంతరముండును.
14ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో
జేసెను
ఆయన కృప నిరంతరముండును.
15ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను
ఆయన కృప నిరంతరముండును.
16అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను
ఆయన కృప నిరంతరముండును.
17గొప్ప రాజులను ఆయన హతముచేసెను
ఆయన కృప నిరంతరముండును.
18ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను
ఆయన కృప నిరంతరముండును.
19అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను
ఆయన కృప నిరంతరముండును.
20బాషానురాజైన ఓగును ఆయన హతము చేసెను
ఆయన కృప నిరంతరముండును.
21ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను
ఆయన కృప నిరంతరముండును.
22తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా
అప్పగించెను
ఆయన కృప నిరంతరముండును.
23మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను
ఆయన కృప నిరంతరముండును.
24మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను
ఆయన కృప నిరంతరముండును.
25సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు
ఆయన కృప నిరంతరముండును.
26ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
ఆయన కృప నిరంతరముండును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 136: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.