కీర్తనలు 118:15-24

కీర్తనలు 118:15-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నీతిమంతుల గుడారాల్లో రక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి: “యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది! యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!” నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను. యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు, కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు. నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి; నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు. మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది; ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది. ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.

షేర్ చేయి
Read కీర్తనలు 118

కీర్తనలు 118:15-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది. యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు. ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.

షేర్ చేయి
Read కీర్తనలు 118

కీర్తనలు 118:15-24 పవిత్ర బైబిల్ (TERV)

మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను. యెహోవా నన్ను శిక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు. మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి, నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను. అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు. యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలరాయి అయ్యింది. ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము. ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

షేర్ చేయి
Read కీర్తనలు 118

కీర్తనలు 118:15-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.

షేర్ చేయి
Read కీర్తనలు 118

కీర్తనలు 118:15-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)