కీర్తనలు 118:15-24

కీర్తనలు 118:15-24 TSA

నీతిమంతుల గుడారాల్లో రక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి: “యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది! యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!” నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను. యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు, కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు. నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి; నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు. మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది; ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది. ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.

Read కీర్తనలు 118