మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను. యెహోవా నన్ను శిక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు. మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి, నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను. అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు. యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలరాయి అయ్యింది. ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము. ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
చదువండి కీర్తనల గ్రంథము 118
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనల గ్రంథము 118:15-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు