లేవీయకాండము 11:12-18
లేవీయకాండము 11:12-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం. పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు, గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ, కాకి జాతిలోని ప్రతి పక్షీ, కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ. ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ, తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు
లేవీయకాండము 11:12-18 పవిత్ర బైబిల్ (TERV)
సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి. “అలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, క్రౌంచ పక్షులు, గద్ద, అన్నిరకాల గద్దలు, అన్ని రకాల నల్ల పక్షులు, నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని రకాల డేగలు, గుడ్లగూబలు, పగిడికంటెలు, పెద్దగుడ్ల గూబలు, నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు
లేవీయకాండము 11:12-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ, పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ
లేవీయకాండము 11:12-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి. “ ‘మీకు అపవిత్రమైనవిగా భావించి మీరు తినకూడని పక్షులు ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు, ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద, ప్రతి రకమైన కాకి, కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ, పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ