యోబు 3:24-26
యోబు 3:24-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది. నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి. దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది; దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది. నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”
యోబు 3:24-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి. ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది. నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.
యోబు 3:24-26 పవిత్ర బైబిల్ (TERV)
నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను. కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి. నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను. అలానే జరిగింది నాకు! నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”
యోబు 3:24-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.
యోబు 3:24-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)