యిర్మీయా 2:1-13
యిర్మీయా 2:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి? ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైనవాటిని అనుసరింతురు కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
యిర్మీయా 2:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: “నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు. ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది, వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు; ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు, విపత్తు వారి మీదికి వస్తుంది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు. యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి. యెహోవా ఇలా చెప్తున్నారు: “మీ పూర్వికులు అంతలా దూరమవడానికి, వారికి నాలో ఏం తప్పు కనిపించింది? వారు విలువలేని విగ్రహాలను పూజించి, వారు విలువలేని వారయ్యారు. వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు. నేను మిమ్మల్ని సారవంతమైన దేశంలోకి, దాని ఫలాలను, శ్రేష్ఠమైన వాటిని తినడానికి తీసుకువచ్చాను. అయితే మీరు వచ్చి నా దేశాన్ని ఆచారరీత్య అపవిత్రం చేసి నా స్వాస్థ్యాన్ని అసహ్యమైనదిగా చేశారు. యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ అని అడగలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, బయలు పేరిట ప్రవచించారు. “కాబట్టి నేను మీమీద మళ్ళీ నేరారోపణ చేస్తాను” మీ పిల్లల పిల్లల మీద కూడా నేరారోపణ చేస్తాను, “అని యెహోవా ప్రకటిస్తున్నారు. కుప్ర తీరాల అవతలి వైపుకు వెళ్లి చూడండి, కేదారుకు దూతల్ని పంపి దగ్గరి నుండి గమనించండి; ఇలాంటిది ఎప్పుడైనా జరిగి ఉంటుందేమో చూడండి: ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా? అయినా అవి దేవుళ్ళే కావు. కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు. ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది, భయంతో వణుకు,” అని యెహోవా చెప్తున్నారు. “నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.
యిర్మీయా 2:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. “యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది. వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.” ఇదే యెహోవా వాక్కు. యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు? ‘ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ’ అని అడగలేదు. అంటే ‘అరణ్యంలో, చవిటి నేలలతో, గోతులతో నిండిన ప్రదేశంలో, అనావృష్టీ చీకటీ నిండిన, ఎవరూ తిరగని, నివసించని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రజలు అడగడం లేదు. ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను. అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.” “యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు. కాబట్టి నేనికనుండి మీపైనా మీ పిల్లల పైనా వారి పిల్లల పైనా నేరం మోపుతాను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా? దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు. ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.
యిర్మీయా 2:1-13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా యొక్క వర్తమానం నాకు వినబడింది. యెహోవా వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి: “‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు. ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు. ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను నీవు నన్ను అనుసరించావు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము: వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం. ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు. ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.’” ఇది యెహోవా వాక్కు. యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి. ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి. యెహోవా ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా? అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు? మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు. ‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మాకు ఎడారులలో మార్గదర్శి అయిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ, ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు. ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు. కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’ మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.” ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను. మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను. కాని మీరు వచ్చి, నా దేశాన్ని అపవిత్ర పర్చారు. ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను. అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు. “యెహోవా ఎక్కడ అని యాజకులు అడగలేదు. నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు. ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు. బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు. వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.” కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను నేను నిందిస్తున్నాను. సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి వెళ్లి చూడండి. ఒకనిని కేదారు రాజ్యానికి పంపి, శ్రద్ధగా పరిశీలించమనండి. అక్కడ ఎవరైనా ఈ రకంగా ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి. ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను క్రొత్త దేవుళ్లతో మార్చుకున్నారా? లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు. “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి. భయకంపితులుకండి!” యెహోవా ఇలా చెప్పాడు. “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు: వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు. (వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.) కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.
యిర్మీయా 2:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి? ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైనవాటిని అనుసరింతురు కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
యిర్మీయా 2:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)