ద్వితీయోపదేశకాండము 4:32-40

ద్వితీయోపదేశకాండము 4:32-40 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దేవుడు భూమి మీద నరుని సృజించిన రోజు నుండి, మీకంటే ముందు ఉన్న గత కాలం గురించి అడగండి; ఆకాశం యొక్క ఒక చివరి నుండి మరో చివరి వరకు అడగండి. ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? లేదా అటువంటి దాని గురించి ఎప్పుడైనా విన్నారా? అగ్ని మధ్యలో నుండి మాట్లాడిన దేవుని స్వరాన్ని మీరు విన్నట్లు మరి ఏ ప్రజలైనా విని బ్రతికారా? మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా? యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఎవరు లేరని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపబడ్డాయి. మిమ్మల్ని క్రమపరచడానికి ఆకాశం నుండి తన స్వరాన్ని మీకు వినిపించారు. భూమి మీద మీకు తన గొప్ప అగ్నిని చూపించారు, ఆ అగ్ని మధ్యలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు. ఆయన మీ పూర్వికులను ప్రేమించి వారి సంతతిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, మీకంటే బలమైన గొప్ప దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి, ఈ రోజు ఇస్తున్నట్లుగా వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన తన సన్నిధితో, తన మహాబలంతో మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించారు. కాబట్టి పైనున్న పరలోకంలో గాని, క్రిందున్న భూమిమీద గాని, యెహోవాయే దేవుడని, మరొక దేవుడు లేడని ఈ రోజే మీరు గుర్తించి, మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి. మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.

ద్వితీయోపదేశకాండము 4:32-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు. మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా? మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా? అయితే యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు. మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు. ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు. కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి. అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి.

ద్వితీయోపదేశకాండము 4:32-40 పవిత్ర బైబిల్ (TERV)

“ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా జరిగిందా? ఎన్నడూ లేదు. గతాన్ని చూడండి, మీరు పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలోచించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా విన్నారా? లేదు. దేవుడు అగ్నిలోనుండి మీతో మాట్లాడగా మీరు వినికూడ యింకా బ్రతికే ఉన్నారు. అలా యింకెవరికైనా ఎన్నడైనా జరిగిందా? లేదు. మరియు ఎప్పుడైనా, ఏ దేవుడైనా మరో దేశంలో నుండి తనకోసం ఒక ప్రజను తీసుకొనేందుకు ప్రయత్నించాడా? లేదు. కానీ మీ యెహోవా దేవుడు అద్భుత కార్యాలను చేయటం మీ మట్టుకు మీరే చూశారు. ఆయన తన శక్తిని, బలాన్ని మీకు చూపించాడు. ప్రజలను పరీక్షించిన కష్టాలను మీరు చూశారు. అద్భుతాలు మహాత్యాలు మీరు చూశారు. సంభవించిన యుద్ధాలు, భయంకర విషయాలు మీరు చూశారు. ఆయనే దేవుడు అని మీరు తెలుసుకొనేందుకు ఈ సంగతులను యెహోవా మీకు చూపించాడు. ఆయనలాంటి దేవుడు ఇంకొకడు ఎవరూ లేరు. యెహోవా మీకు ఒక పాఠం ప్రబోధించేందుకు పరలోకంనుండి ఆయన తన స్వరాన్ని మిమ్మల్ని విననిచ్చాడు. భూమి మీద ఆయన తన మహా అగ్నిని మిమ్మల్ని చూడనిచ్చి, దానిలోనుండి ఆయన మీతో మాట్లాడాడు. “యెహోవా మీ వూర్వీకులను ప్రేమించాడు. అందుకే వారి సంతతివారైన మిమ్మల్ని ఆయన ఏర్పర చుకొన్నాడు. మరియు అందుకే ఆయన మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ఆయన మీతో ఉండి తన మహా శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. మీరు ముందుకు సాగినప్పుడు, మీ ముందు బలమైన గొప్ప రాజులను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. అయితే వారి దేశంలోనికి యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు నివసించేందుకు వారి దేశాన్ని ఆయన మీకు యిచ్చాడు. పైగా నేటికీ ఈ దేశం యింకా మీదే. “అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశంలోను, క్రింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక వేరే ఏ దేవుడూ లేడు. మరియు ఈ వేళ నేను మీకు యిచ్చే ఆయన చట్టాలు, ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీకూ, మీ తర్వాత జీవించే పిల్లలకు అంతా శుభం అవుతుంది. శాశ్వతంగా మీ దేశంగా ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఈ దేశంలో మీరు దీర్ఘకాలం జీవిస్తారు.”

ద్వితీయోపదేశకాండము 4:32-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగానుండినమునుపటి దినములలో ఆకాశముయొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా? అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వరమును నీకు వినిపించెను; భూమిమీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్యనుండి ఆయన మాటలను నీవు వింటిని. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్ల గొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడు గానుండి ఐగుప్తులోనుండి తన మహాబలముచేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.

ద్వితీయోపదేశకాండము 4:32-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)