దానియేలు 10:11-14
దానియేలు 10:11-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతడు, “దానియేలూ! నీవు ఎంతో విలువైనవాడవు, నేను నీతో మాట్లాడే మాటలు శ్రద్ధగా ఆలోచించి, లేచి నిలబడు, ఎందుకంటే నేను నీ దగ్గరకు పంపబడ్డాను” అన్నాడు. అతడు ఇది చెప్పిన తర్వాత, నేను వణకుతూ లేచి నిలబడ్డాను. అప్పుడతడు అన్నాడు, “దానియేలూ, భయపడకు. నీవు గ్రహింపు కోసం నీ మనస్సును సిద్ధపరచుకుని, నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకున్న మొదటి రోజు నుండే నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి, వాటికి జవాబుగా నేను వచ్చాను. అయితే, పర్షియా రాజ్యాధిపతి ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పర్షియా రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చింది కాబట్టి ప్రముఖ దేవదూతల్లో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నీ ప్రజలకు భవిష్యత్తులో జరుగబోయే వాటిని నీకు వివరించడానికి వచ్చాను, ఎందుకంటే దర్శనం రాబోయే కాలం గురించి వచ్చింది.”
దానియేలు 10:11-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను. అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.
దానియేలు 10:11-14 పవిత్ర బైబిల్ (TERV)
అతడు నాతో, “బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువబడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను” అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను. అప్పుడు అతడు నాతో, “దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థిస్తూంన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను. పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను. అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది” అని చెప్పాడు.
దానియేలు 10:11-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని. అప్పుడతడు–దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని పారసీకుల రాజ్యాధిపతి ఇరువదియొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను, ఈ దర్శనపు సంగతి ఇంక అనేకదినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.
దానియేలు 10:11-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)