యెషయా 15

15
మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం
1మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం:
ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం
పాడై నశిస్తుంది!
ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం
పాడై నశిస్తుంది!
2దీబోను ఏడ్వడానికి గుడికి
తన క్షేత్రాలకు వెళ్తుంది;
నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది.
ప్రతి తల క్షౌరం చేయబడింది
ప్రతివాని గడ్డం గొరిగించబడింది.
3వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు;
తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో
వారందరు రోదిస్తారు,
ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.
4హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు,
యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది.
కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు,
వారి హృదయాలు క్రుంగిపోతాయి.
5మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది;
వారిలో పారిపోయినవారు సోయరు వరకు,
ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు.
వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు
ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు;
హొరొనయీము వెళ్లే దారిలో
తమ నాశనం గురించి విలపిస్తారు.
6నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి
గడ్డి ఎండిపోయింది;
వృక్ష సంపద ఉండదు
పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.
7కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని
నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.
8వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి;
వారి రోదన ఎగ్లయీము వరకు
వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.
9దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి
కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను.
మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి
ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 15: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెషయా 15 కోసం వీడియో