కీర్తనలు 8

8
కీర్తన 8
సంగీత దర్శకునికి. గిత్తీతు రాగములో పాడదగినది. దావీదు కీర్తన.
1యెహోవా, మా ప్రభువా,
భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది!
మీరు ఆకాశాల్లో
మీ మహిమను ఉంచారు.
2చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా,
మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి
మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు.
3మీ చేతి పనియైన
మీ ఆకాశాలను,
మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన
చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,
4మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు?
మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?
5మీరు వారిని#8:5 లేదా అతన్ని దేవదూతల#8:5 లేదా దేవుని కంటే కొంచెం తక్కువగా చేశారు,
మహిమ ఘనతను వారికి#8:5 లేదా అతనికి కిరీటంగా పెట్టారు.
6మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు;
మీరు సమస్తాన్ని అనగా:
7-8గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని,
అడవి జంతువులను,
ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను,
సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను
వారి పాదాల క్రింద ఉంచారు.
9యెహోవా, మా ప్రభువా,
భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది!

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 8: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి