కీర్తనలు 7
7
కీర్తన 7
దావీదు వీణతో పాడిన కీర్తన. బెన్యామీనీయుడైన కూషు విషయంలో దావీదు యెహోవాకు పాడిన కీర్తన.
1యెహోవా నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను;
నన్ను వెంటాడే వారందరి నుండి నన్ను రక్షించి విడిపించండి,
2లేకపోతే వారు సింహంలా చీల్చివేస్తారు
ఎవరు విడిపించలేనంతగా నన్ను ముక్కలు చేస్తారు.
3యెహోవా నా దేవా, ఒకవేళ నేను
అన్యాయమైన చర్యలకు పాల్పడితే
4నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే
కారణం లేకుండ నా శత్రువును నేను దోచుకుంటే
5అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక;
నా ప్రాణాన్ని నేల మీద అణగద్రొక్కి
నా ప్రతిష్ఠను మట్టిపాలు చేయును గాక. సెలా
6యెహోవా, కోపంతో లేవండి;
నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా లేవండి.
నా దేవా, మేల్కొనండి; న్యాయాన్ని శాసించండి.
7మీరు వారికి పైగా ఉన్నత సింహాసనంపై ఆసీనులై ఉండగా,
ఆయా జాతుల ప్రజలు మీ చుట్టూ గుమికూడనివ్వండి.
8యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక.
యెహోవా, నా నీతిని బట్టి, ఓ మహోన్నతుడా,
నా యథార్థతను బట్టి నాకు శిక్షావిముక్తి చేయండి.
9మనస్సులను హృదయాలను పరిశీలించే,
నీతిమంతుడవైన దేవా,
దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి,
నీతిమంతులను భద్రపరచండి.
10యథార్థ హృదయులను కాపాడే
సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు.#7:10 లేదా ప్రభువు
11దేవుడు నీతిగల న్యాయమూర్తి,
ఆయన దుష్టులపై ప్రతిరోజు తన ఉగ్రతను చూపిస్తారు.
12ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే,
దేవుడు#7:12 ప్రా.ప్ర.లలో ఆయన తన ఖడ్గాన్ని పదునుపెడతారు;
ఆయన తన విల్లు ఎక్కుపెట్టి బాణం సిద్ధపరుస్తారు.
13ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు;
ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.
14దుష్టులు చెడును గర్భం దాలుస్తారు,
కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు.
15ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు
తాము త్రవ్విన గుంటలో వారే పడతారు.
16వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది;
వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది.
17యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను;
మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 7: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.