నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు. ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు. యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు. యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు. సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.
చదువండి కీర్తనలు 34
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 34:3-10
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు