కీర్తనలు 34:3-10

కీర్తనలు 34:3-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నాతోకూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెనువారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.

కీర్తనలు 34:3-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు. ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు. యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు. యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు. సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.

కీర్తనలు 34:3-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం. నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు. ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు. అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు. యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు. యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి. యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు. సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.

కీర్తనలు 34:3-10 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి. మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం. సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు. నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు. సహాయం కోసం దేవుని తట్టు చూడండి. మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు. ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా నా మొర విన్నాడు. నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు. యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు. ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు. యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి. యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు. యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి. ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు. యౌవనసింహాలు బలహీనమై, ఆకలిగొంటాయి. అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.

కీర్తనలు 34:3-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నాతోకూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెనువారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.

కీర్తనలు 34:3-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు. ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు. యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు. యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు. సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.

కీర్తనలు 34:3-10

కీర్తనలు 34:3-10 TELUBSIకీర్తనలు 34:3-10 TELUBSI