కీర్తనలు 19
19
కీర్తన 19
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
1ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి;
అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.
2పగటికి పగలు బోధ చేస్తుంది;
రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.
3వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు;
వాటి స్వరం వినబడదు.
4అయినా వాటి స్వరం#19:4 హెబ్రీలో కొలమానం భూమి అంతటికి,
వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి.
దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు.
5సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా,
తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు.
6ఆకాశంలో ఒక చివర ఉదయించి
మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు.
దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.
7యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది,
అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది.
యెహోవా కట్టడలు నమ్మదగినవి,
అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.
8యెహోవా కట్టడలు సరియైనవి,
హృదయానికి ఆనందం కలిగిస్తాయి.
యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి,
కళ్లకు కాంతి కలిగిస్తాయి.
9యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది,
నిరంతరం నిలుస్తుంది.
యెహోవా శాసనాలు నమ్మదగినవి,
అవన్నీ నీతియుక్తమైనవి.
10అవి బంగారం కంటే,
మేలిమి బంగారం కంటే విలువైనవి;
తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే
ధారల కంటే మధురమైనవి.
11వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు;
వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది.
12తమ తప్పిదాలను ఎవరు తెలుసుకోగలరు?
నేను దాచిన తప్పులను క్షమించండి.
13కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి;
అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి.
అప్పుడు నేను యథార్థవంతుడనై
ఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను.
14యెహోవా, నా కొండ, నా విమోచకా,
నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం
మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 19: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.