కీర్తనలు 58

58
ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. దావీదు రచించిన కీర్తన. అనుపదగీతము.
1అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు
రన్నది నిజమా?
నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు
దురా?
2లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము
జరిగించుచున్నారు
దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.
3తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు
పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
4వారి విషము నాగుపాము విషమువంటిది
5మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననువారి స్వరము తనకు వినబడకుండునట్లు
చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.
6దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము
యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ
గొట్టుము.
7పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు
అతడు తన బాణములను సంధింపగా
అవి తునాతునకలై పోవును.
8వారు కరగిపోయిన నత్తవలె నుందురు
సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.
9మీకుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే
అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర
గొట్టుచున్నాడు,
10ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూచి సంతో
షించుదురు
భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.
11కావున–నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు
ననియు
నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో
నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 58: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 58