నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించు కొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురు తన కోపమువలన యెహోవావారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును. భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింప జేసెదవు. వారు నీకు కీడుచేయవలెనని ఉద్దేశించిరిదురు పాయము పన్నిరి కాని దానిని కొనసాగింప లేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు. యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించె దము.
చదువండి కీర్తనలు 21
వినండి కీర్తనలు 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 21:8-13
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు