యెహోషువ 19

19
1రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశ స్థుల స్వాస్థ్యము మధ్యనుండెను. 2వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా 3హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా 4-6సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా బేత్లెబాయోతు షారూ హెను అనునవి, వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు. 7అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు. 8దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము. 9షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.
10మూడవవంతు చీటి వారి వంశములచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను. 11వారి సరిహద్దు పడమటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి 12శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి 13అక్కడనుండి తూర్పుతట్టు గిత్తహెపెరువరకును ఇత్కాచీను వరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను. 14దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను. 15కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును. 16ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.
17-23నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను అబెసు రెమెతు ఏన్గన్నీము ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు అను స్థలములను దాటి యొర్దానువరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతోకూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
24అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. 25వారి సరిహద్దు హెల్కతు హలి, బెతెను, అక్షాపు 26అలమ్మేలెకు అమాదు మిషెయలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి 27తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు 28ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. 29అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసావరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపెట్టి సముద్రమువరకు సాగెను. 30ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతోకూడ అవి యిరువదిరెండు పట్టణములు. 31వాటి పల్లెలతోకూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
32ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. 33వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సింధూరవనమును అదామియను కనుమను యబ్నెయేలును మొదలుకొని లక్కూమువరకు సాగి 34అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరువరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను. 35-38కోటగల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు అదామా రామా హాసోరు కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అనునవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు. 39ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తా లీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
40-46ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు –జొర్యా ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను అయ్యాలోను యెత్లా ఏలోను తిమ్నా ఎక్రోను ఎల్తెకే గిబ్బెతోను బాలాతా యెహుదు బెనేబెరకు గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను. 47దానీయుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమపితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరుపెట్టిరి. 48వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
49సరిహద్దులనుబట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. 50యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. 51యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్లవలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచి పెట్టుట ముగించిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 19: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యెహోషువ 19