యెషయా 56
56
1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది
నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది.
న్యాయవిధిని అనుసరించుడి
నీతిని అనుసరించి నడుచుకొనుడి.
2నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ
కుండ దానిని అనుసరించుచు
ఏ కీడుచేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు
ఆప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు
ధన్యుడు.
3యెహోవాను హత్తుకొను అన్యుడు–
నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను
వెలివేయునని అనుకొనవద్దు.
షండుడు–నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.
4నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు
నాకిష్టమైనవాటిని కోరుకొనుచు
నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను
గూర్చి
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
5–నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ
మును వారికిచ్చెదను
కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె
శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను
కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను
6విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు
నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు
దాసులై యెహోవా నామమును ప్రేమించుచు
ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున
చేరు అన్యులను
నా పరిశుద్ధపర్వతమునకు తోడుకొని వచ్చెదను
7నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను
నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు
లును నాకు అంగీకారములగును
నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన
బడును.
8ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు
ప్రభువగు యెహోవా వాక్కు ఇదే
–నేను సమకూర్చిన ఇశ్రాయేలువారికిపైగా ఇతరు
లను కూర్చెదను.
9పొలములోని సమస్త జంతువులారా,
అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు
రండి.
10వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు
వారందరు మూగకుక్కలు మొరుగలేరు
కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.
11కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి
తృప్తిలేదు.
ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు
వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు
ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా
రించుకొందురు.
12వారిట్లందురు–నేను ద్రాక్షారసము తెప్పించెదను
మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి
నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 56: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.