యెషయా 55
55
1దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి
రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము
చేయుడి.
రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే
ద్రాక్షారసమును పాలను కొనుడి.
2ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు?
సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును
ఎందుకు వ్యయపరచెదరు?
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము
భుజించుడి
మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి.
3చెవియొగ్గి నాయొద్దకు రండి
మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు
నేను మీతో నిత్యనిబంధన చేసెదను
దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
4ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని
జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి
తిని
5నీవెరుగని జనులను నీవు పిలిచెదవు
నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా
చూచి
నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ
దేవునిబట్టి
నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.
6యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను
వెదకుడి
ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు
కొనుడి.
7భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను
దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి
యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా
క్షమించును.
8నా తలంపులు మీ తలంపులవంటిని కావు
మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు
ఇదే యెహోవా వాక్కు
9ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో
మీ మార్గములకంటె నా మార్గములు
మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా
ఉన్నవి.
10వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి
ఏలాగు మరలక
భూమిని తడిపి విత్తువానికి విత్తనమును
భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి
వర్ధిల్లునట్లు చేయునో
ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును
11నిష్ఫలముగా నాయొద్దకు మరలక
అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును
నేను పంపిన కార్యమును సఫలముచేయును.
12మీరు సంతోషముగా బయలువెళ్లుదురు
సమాధానము పొంది తోడుకొని పోబడుదురు
మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము
చేయును
పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.
13ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు
చును
దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు
గును
అది యెహోవాకు ఖ్యాతిగాను
ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన
గాను ఉండును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 55: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.