యెషయా 53

53
1మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?
యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
2లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన
మొక్కవలెను
అతడు ఆయనయెదుట పెరిగెను.
అతనికి సురూపమైనను సొగసైనను లేదు
మనమతని చూచి, అపేక్షించునట్లుగా
అతనియందు సురూపము లేదు.
3అతడు తృణీకరింపబడినవాడును ఆయెను
మనుష్యులవలన విసర్జింపబడినవాడును
వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు
గాను
మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను.
అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని
ఎన్నికచేయకపోతిమి.
4నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను
మన వ్యసనములను వహించెను
అయినను మొత్తబడినవానిగాను
దేవునివలన బాధింపబడినవానిగాను
శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.
5మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ
బడెను
మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను
మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను
అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.
6మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి
మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను
యెహోవా మన యందరి దోషమును అతనిమీద
మోపెను.
7అతడు దౌర్జన్యము నొందెను
బాధింపబడినను అతడు నోరు తెరవలేదు
వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు
బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు
మౌనముగా నుండునట్లు
అతడు నోరు తెరవలేదు.
8అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను
అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను
గదా.
సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను
అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో
చించినవారెవరు?
9అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి
నియమింపబడెను
ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను
నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు
అతని నోట ఏ కపటమును లేదు.
10అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను
ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.
అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా
అతని సంతానము చూచును.
అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము
అతనివలన సఫలమగును.
11అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును.
నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి
తనకున్న అనుభవజ్ఞానము చేత#53:11 లేక, తన్నుగూర్చిన జ్ఞానముచేత.
అనేకులను నిర్దోషులుగా చేయును.
12కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను
ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును.
ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ
మును ధారపోసెను
అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను
అనేకుల పాపమును భరించుచు
తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 53: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెషయా 53 కోసం వీడియో