యెషయా 52

52
1సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము
పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర
ములను ధరించుకొనుము
ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను
అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.
2ధూళి దులుపుకొనుము యెరూషలేమా,
లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ,
నీ మెడకట్లు విప్పివేసికొనుము.
3యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–మీరు ఊరకయే అమ్మబడితిరి గదా
రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.
4దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా
తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా
జనులు ఐగుప్తునకు పోయిరి.
మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.
5నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు
వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు
ఇదే యెహోవా వాక్కు
దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది
6కావున ఇచ్చట నేనేమి చేయవలెను?
ఇదే యెహోవా వాక్కు.
నా జనులు నా నామము తెలిసికొందురు
నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దిన
మున తెలిసికొందురు.
7సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు
సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము
ప్రచురించువాని పాదములు,
నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న
వాని పాదములు
పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
8ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు
కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు
యెహోవా సీయోనును మరల రప్పించగా వారు
కన్నులార చూచుచున్నారు.
9యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా,
ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి
యెహోవా తన జనులను ఆదరించెను యెరూష
లేమును విమోచించెను.
10సమస్తజనముల కన్నులయెదుట
యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి
యున్నాడు.
భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ
చూచెదరు.
11పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి
అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి
తొలగిపోవుడి
యెహోవా సేవోపకరణములను మోయువారలారా,
మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి
12మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా
వెళ్లరు.
యెహోవా మీ ముందర నడచును
ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును
కావలికాయును
13ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును
అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా
ఎంచబడును.
14నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖ
మును, నరరూపముకంటె అతని రూపమును చాల
వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరో
15ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును#52:15 లేక, జనములకు విస్మయము పుట్టించును.
రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు
తమకు తెలియజేయబడని సంగతులువారు చూచెదరు
తాము విననిదానిని గ్రహింతురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 52: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెషయా 52 కోసం వీడియో