యెషయా 29
29
1అరీయేలుకు శ్రమ
దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ
సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి
పండుగలను క్రమముగా జరుగనీయుడి.
2నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును
కలుగును
అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.
3నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము
వేయుదును.
నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.
4అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు
నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం
డును
కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును
నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.
5నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత
విస్తారముగానుండును
బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలెనుండును
హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభ
వించును.
6ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను
సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల
తోను
సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.
7అరీయేలుతో యుద్ధముచేయు సమస్త జనుల సమూహ
మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము
చేయువారును
దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము
వలె ఉందురు.
8ఆకలిగొన్నవాడు కలలో భోజనముచేసి మేల్కొనగా
వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును
దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా
సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని
యున్నట్లును
సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల
సమూహమంతటికి సంభవించును.
9జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి
మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి
ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు
మద్యపానము చేయకయే తూలుచున్నారు.
10యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి
యున్నాడు
మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి
యున్నాడు
మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి
యున్నాడు.
11దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ
వాక్యములవలె ఉన్నది
ఒకడు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర
ములు తెలిసినవానికి వానిని అప్పగించును;
అతడు–అది నావలన కాదు అది గూఢార్థముగా
ఉన్నదని చెప్పును.
12మరియు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర
ములు తెలియనివానికి దానిని అప్పగించును
అతడు–అక్షరములు నాకు తెలియవనును.
13ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు
–ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు
పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని
తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారువారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు
లనుబట్టి వారు నేర్చుకొనినవి.
14కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య
కార్యము జరిగింతును
బహు ఆశ్చర్యముగా జరిగింతునువారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగునువారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.
15తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో
పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ.
మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి
యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరి
గించువారికి శ్రమ.
16అయ్యో, మీరెంత మూర్ఖులు?
కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా?
చేయబడిన వస్తువు దాని చేసినవానిగూర్చి–ఇతడు
నన్ను చేయలేదనవచ్చునా?
రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి–ఇతనికి
బుద్ధిలేదనవచ్చునా?
17ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను
ప్రదేశము ఫలవంతమైన పొలమగును
ఫలవంతమైన పొలము వనమని యెంచబడును.
18ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు
అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను
గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.
19యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక
మగును
మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ
దేవునియందు అనందించెదరు.
20బలాత్కారులు లేకపోవుదురు
పరిహాసకులు నశించెదరు.
21కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమునుబట్టి
యితరులను పాపులనుగా చేయుచు
గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని
ఉరి నొడ్డుచు
మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు
నరకబడుదురు.
22అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా
యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల
విచ్చుచున్నాడు
–ఇకమీదట యాకోబు సిగ్గుపడడు
ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.
23అతని సంతానపువారు తమ మధ్య నేనుచేయు
కార్యమును చూచునప్పుడు
నా నామమును పరిశుద్ధపరచుదురు
యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు
ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.
24చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు
సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 29: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.