యెషయా 28
28
1త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ .
కిరీటమునకు శ్రమ
వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణ
మునకు శ్రమ
ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన
లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.
2ఆలకించుడి, బలపరాక్రమములుగలవాడొకడు
ప్రభువుకు ఉన్నాడు
ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల
ప్రవాహమును
ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు
ఆయన తన బలముచేత పడద్రోయువాడు.
3త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము
కాళ్లతో త్రొక్కబడును.
4ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు
పుష్పమువంటిదాని సుందరభూషణము
వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూ
రపు పండువలె అగును
దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని
చేతిలో పడినవెంటనే
అది మ్రింగివేయబడును.
5ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం
చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగానుండును
సౌందర్యముగల మకుటముగా నుండును.
6ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు
తీర్చ నేర్పు ఆత్మగాను
గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి
పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.
7అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు
మద్యమువలన తత్తరపడుదురు
యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన
సొక్కి సోలుదురు
ద్రాక్షారసము వారిని మ్రింగివేయుచున్నది
మద్యమువలన తత్తరపడుచున్నారు
దర్శనము కలుగునప్పుడు సోలుదురు
తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.
8వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల
తోను నిండియున్నవి
అవి లేనిచోటు లేదు.
9వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ
జేయును?
తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?
10ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ
సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి
సూత్రము
కొంత ఇచ్చట కొంత అచ్చట
చెప్పుచున్నాడని వారనుకొందురు.
11నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి
12ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు
13నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను
ఈ జనులతో మాటలాడుచున్నాడు.
అయినను వారు విననొల్లైరెరి.
కావునవారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు
బడి పట్టబడునట్లు
ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ
సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి
సూత్రము
కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము
మీకు వచ్చును.
14కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు
అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి
15–మేము మరణముతో నిబంధన చేసికొంటిమి
పాతాళముతో ఏకమైతిమి
ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు
అది మాయొద్దకు రాదు
అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి
మాయక్రింద దాగియున్నాము
అని మీరు చెప్పుకొనుచున్నారే.
16ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు
–సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను
నేనే
అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి
బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది
విశ్వసించువాడు కలవరపడడు.
17నేను న్యాయము కొలనూలుగాను
నీతి మట్టపుగుండుగాను పెట్టెదను
వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును
దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.
18మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ
బడును
పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలు
వదు
ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగు
దురు
19వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును
ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది
వచ్చును
ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము
పుట్టును.
20పండుకొనుటకు మంచము పొడుగు చాలదు
కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.
21నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్య
మును చేయుటకు
అపూర్వమైన తన కార్యము నొనరించుటకు
ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు
యెహోవా లేచును
గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును.
22మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాస
కులై యుండకుడి
భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప
బడెను
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన
నేను దాని సమాచారము వింటిని
23చెవియొగ్గి నా మాట వినుడి
ఆలకించి నేను పలుకునది వినుడి
24దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా?
అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?
25అతడు నేల చదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ
చల్లును
తెల్ల జీలకఱ్ఱ చల్లును
గోధుమలు వరుసగా విత్తును
యవలను తానేర్పరచిన చేనిలో చల్లును
దాని అంచున మెరపమొలకలు వేయును గదా?
26వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు
ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.
27సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత
నూర్చడు
బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని
కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల
గొట్టును గదా?
28మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా?
సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు
ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని
మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా!
29జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని
నేర్చుకొందురు.
ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్ర
హించువాడు ఆయనే
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 28: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.